తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Electric Scooters: స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్లిన హీరో ఎలక్ట్రిక్.. మరోసారి ఆ మార్కును దాటి..

Hero Electric Scooters: స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్లిన హీరో ఎలక్ట్రిక్.. మరోసారి ఆ మార్కును దాటి..

03 April 2023, 22:41 IST

google News
    • Hero Electric Sales: హీరో ఎలక్ట్రిక్ సంస్థ మరోసారి లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. 2023 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో అదరగొట్టింది.
Hero Electric Scooters: స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్లిన హీరో ఎలక్ట్రిక్
Hero Electric Scooters: స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్లిన హీరో ఎలక్ట్రిక్ (HT Auto)

Hero Electric Scooters: స్కూటర్ల సేల్స్‌లో దూసుకెళ్లిన హీరో ఎలక్ట్రిక్

Hero Electric Sales: ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) మరోసారి అమ్మకాల్లో అదరగొట్టింది. 2023 ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్ - 2023 మార్చి)లో లక్షకుపైగా యూనిట్లను విక్రయించింది. సేల్స్ లక్ష మార్కును దాటడం ఆ కంపెనీకి ఇది వరుసగా రెండోసారి. ఫొటోన్, ఆప్టిమా, ఎన్‍వైఎక్స్, ఎడ్డీ, అట్రియా, ఫ్లాష్ మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు మరిన్ని ప్రొడక్టులు హీరో ఎలక్ట్రిక్ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వివరాలివే.

20 శాతం వృద్ధి

Hero Electric Sales: హీరో ఎలక్ట్రిక్ టర్నోవర్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లను దాటింది. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని ఆ సంస్థ సీఈవో సోహిందర్ గిల్ పేర్కొన్నారు.

Hero Electric Sales: హీరో ఎలక్ట్రిక్ ఇటీవల ఆప్టిమా సీఎక్స్ డ్యుయల్ బ్యాటరీ, ఆప్టిమా సీఎక్స్ సింగిల్ బ్యాటరీ, ఎన్‍వైఎక్స్ డ్యుయల్ బ్యాటరీ స్కూటర్లను లాంచ్ చేసింది. కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, అప్‍డేటెడ్ పవర్ ట్రైన్స్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్లను తీసుకొచ్చింది. కస్టమర్ల కోసం తాము ఆవిష్కరణలు చేస్తూ కొత్త ప్రొడక్టులను తీసుకొస్తూనే ఉంటామని గిల్ పేర్కొన్నారు.

Hero Electric Sales: దేశ వ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలను, డీలర్‌షిప్‍లను పెంచుకునేందుకు హీరో ఎలక్ట్రిక్ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏడాదికి 5 లక్ష స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్‍ను హీరో ఎలక్ట్రిక్ కలిగి ఉంది. కాగా 20 లక్షల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా రాజస్థాన్‍లో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‍ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేసింది. ఈ ఏడాది ముగిసేలోగా ఈ ప్లాంట్‍ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 800కుపైగా టచ్ పాయింట్లు ఉన్నాయని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. టచ్ పాయింట్లలో కస్టమర్లు.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‍సైట్ ద్వారా ఆన్‍లైన్‍లోనూ బుక్ చేసుకోవచ్చు.

Hero Electric Sales: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా ఉన్న హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ డ్యుయల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.85,190 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 82 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఆప్టిమా సీఎక్స్ ధర రూ.67,190గా ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఫొటోన్ ఎల్‍పీ స్కూటర్ ప్రారంభ ధర రూ.86,391 (ఎక్స్-షోరూమ్)‍గా ఉంది.

తదుపరి వ్యాసం