తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Money-saving Feature: గూగుల్ కొత్త ఫీచర్; చీప్ గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు..

Google money-saving feature: గూగుల్ కొత్త ఫీచర్; చీప్ గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు..

HT Telugu Desk HT Telugu

30 August 2023, 11:35 IST

  • Google money-saving feature: విమాన ప్రయాణాలు కామన్ అయిన పరిస్థితుల్లో.. తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్స్ ను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించే సరికొత్త ఫీచర్ ను గూగుల్ ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google money-saving feature: విమాన ప్రయాణాలు కామన్ అయిన పరిస్థితుల్లో.. తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్స్ ను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించే సరికొత్త ఫీచర్ ను గూగుల్ ప్రారంభించింది.

డేట్ అండ్ రూట్ చెబితే చాలు..

విమాన ప్రయాణికులకు, ముఖ్యంగా తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి గూగుల్ ఒక శుభవార్త తెలిపింది. తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వీలు కల్పించే ఒక సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా తమ బ్లాగ్ పోస్టులో తెలియజేసింది. ముఖ్యంగా హాలిడే సీజన్స్ లో కానీ, వేరే సమయాల్లో కానీ, ఏ ఏ రూట్లలో ఏ ఏ ఎయిర్ లైన్స్ లో తక్కువ ధర కి విమాన టికెట్స్ లభిస్తాయి అన్నది ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మీరు ప్రయాణించాలనుకున్న తేదీని, మీ గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తే ఆయా తేదీల్లో, ఆయా రూట్లలో ఏ ఎయిర్లైన్స్ లో తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందో కూడా ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.

నమ్మకమైన డేటా

ఎయిర్ ట్రావెల్, ఎయిర్ లైన్స్ ఫేర్స్, ఎయిర్ ట్రావెల్ రూట్స్ కు సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది. పూర్తిగా నమ్మకమైన డేటాను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటామని గూగుల్ వెల్లడించింది. ఏ సమయాల్లో సాధారణంగా ఫ్లైట్ రేట్స్ తక్కువగా ఉంటాయో కూడా ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ప్రయాణించాలనుకున్న డేట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే వివరాలు తెలియజేస్తే చాలు ఆ రూట్లో ఆ రోజు ఏ ఎయిర్ లైన్స్ తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్స్ అందిస్తున్నాయో గూగుల్ తెలియజేస్తుంది.

టూరిస్ట్ ప్లేసెస్ కు కూడా

అలాగే ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి ఏ సమయాల్లో తక్కువ రేట్ కి ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయో కూడా ఈ గూగుల్ ఫీచర్ తెలియజేస్తుంది. ఒకవేళ మీరు వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణించే డేట్ ముందే తెలిసి ఉంటే.. ఆ డేట్ లోపు తక్కువ రేట్ కు ఫ్లైట్ టికెట్స్ లభించే తేదీలను కూడా గూగుల్ మీకు నోటిఫై చేస్తుంది. ఈ ఫీచర్ ను పొందడానికి గూగుల్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ క్రిస్మస్ కు మీరు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ మొదటి రెండవ వారాల్లో టికెట్స్ బుక్ చేసుకోవడం ఉత్తమమని గూగుల్ సూచిస్తోంది. మీ ప్రయాణానికి కనీసం 71 రోజుల ముందు టికెట్స్ బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకు అవి లభించే అవకాశం ఉందని గూగుల్ చెబుతోంది. ముఖ్యంగా ప్రయాణ తేదీకి 54 నుంచి 78 రోజుల ముందు బుక్ చేసుకుంటే చీప్ రేట్స్ కి టికెట్స్ లభించే అవకాశం ఉందని వివరిస్తోంది.

తదుపరి వ్యాసం