తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

19 April 2024, 5:31 IST

    • Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా దిగొచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 67,640కి చేరింది. గురువారం ఈ ధర రూ. 67,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,76,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,764గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,790కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,800గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,37,900గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,790గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,940గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,640 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,790గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,340గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,550గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,640గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,790గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,790గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,690గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,840గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,640గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,790గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 86,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 86,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,400.. బెంగళూరులో రూ. 86,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 440 పడి.. రూ 25,100కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,540గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం