తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Free Petrol : ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్​ ఇస్తున్నారు.. ఇది తెలుసుకుంటే మీ డబ్బు ఆదా!

Free petrol : ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్​ ఇస్తున్నారు.. ఇది తెలుసుకుంటే మీ డబ్బు ఆదా!

Sharath Chitturi HT Telugu

19 October 2024, 7:20 IST

google News
    • Fuel credit card : మీ బండికి తరచూ పెట్రోల్​, డీజిల్​ కొట్టిస్తుంటారా? మీ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు గురించి తెలసుకోవాలి.
ఉచితంగా పెట్రోల్​ కావాలంటే ఇలా చేయండి..
ఉచితంగా పెట్రోల్​ కావాలంటే ఇలా చేయండి..

ఉచితంగా పెట్రోల్​ కావాలంటే ఇలా చేయండి..

మీరు రోజు బైక్​ లేదా కారులో ప్రయాణిస్తుంటారా? వెహికిల్స్​కి తరచుగా పెట్రోల్​, డీజిల్​ కొట్టిస్తుంటారా? మరి బిల్లు ఆదా చేసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే! మీ ఖర్చులు తగ్గించుకునే విధంగా వార్షికంగా 50 లీటర్ల వరకు ఇంధనాన్ని ఉచితంగా పొందొచ్చు. దీని కోసం మీరు ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు గురించి తెలసుకోవాలి. పూర్తి వివరాలు..

ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు..

కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు, వారి క్రెడిట్​ కార్డు స్పెండింగ్​ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ క్రెడిట్​ కార్డులతో కస్టమర్స్​కి మంచి బెనిఫిట్స్​ ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి.. ఈ ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు. దీని ద్వారా వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్​ లేదా డీజిల్​ని ఫ్రీగా పొందొచ్చు.

ఈ క్రెడిట్​ కార్డు ఫీచర్స్​ ఇవే-

  • వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్​, డీజిల్​ ఫ్రీ!
  • ఇండియన్​ ఆయిల్​ ఔట్​లెట్స్​లో ఇంధన కొట్టించి 5శాతం వరకు ఫ్యూయెల్​ పాయింట్స్​ పొందొచ్చు. (మొదటి 6 నెలల వరకు ప్రతి నెల గరిష్ఠంగా 250 ఫ్యూయెల్​ పాయింట్స్​, ఆ తర్వాతి 6 నెలల వరకు 1150 ఫ్యూయెల్​ పాయింట్స్​.)
  • గ్రాసరీ, బిల్​ పేమెంట్స్​పైనా ప్రతి నెల 100 ఫ్యూయెల్​ పాయింట్స్​ వరకు పొందొచ్చు.
  • రూ. 150 వరకు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్​తో పాటు ఇతర లావాదేవీలపై 1 ఫ్యూయెల్​ పాయింట్​ పొందొచ్చు.

అదనపు ఫీచర్స్​-

  • IndianOil XTRAREWARDSTM Program (IXRP) membership ని కాంప్లిమెంటరీగా లభిస్తుంది.
  • రివాల్వింగ్​ క్రెడిట్​, జీరో లాస్ట్​ కార్డ్​ లయబిలిటీ, ఇంటరెస్ట్​ ఫ్రీ క్రెడిట్​ పీరియడ్​ వంటి వాటిని పొందొచ్చు.
  • సర్​ఛార్జ్​ తొలగింపు- కనిష్ఠంగా రూ. 400 ఇంధన బిల్లుపై 1శాతం ఫ్యూయెల్​ సర్​ఛార్జ్​ని రద్దు చేసుకోవచ్చు.

ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్​- వాలిడిటీ, ఇతర వివరాలు..

ఈ ఫ్యూయెల్​ పాయింట్స్​ వాలిడిటీ గరిష్ఠంగా 2ఏళ్లు.

ఐఓసీఎల్​ ఔట్​లెట్స్​ వద్ద ఈ ఫ్యూయెల్​ పాయింట్స్​ని రిడీమ్​ చేసుకోవచ్చు. 1 ఫ్యుయెల్​ పాయింట్​ అంటే రూ. 96 పైసలు.

లేదా నెట్​బ్యాంకింగ్​, క్యాష్​బ్యాక్​ రూపంలో కూడా రిడీమ్​ చేసుకోవచ్చు. కానీ వీటి వాల్యూ వేరువేరుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు ఎలిజిబిలిటీ..

సాలరీ పొందుతున్న భారతీయులకు- వయస్సు 21 నుంచి 60ఏళ్ల మధ్యలో ఉండాలి. నెలవారీ జీతం రూ. 12వేలు కన్నా ఎక్కువ ఉండాలి.

వ్యాపారులకు- వయస్సు 21 నుంచి 65 మధ్యలో ఉండాలి. వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా ఎక్కువగా ఉండాలి.

ఫీజు- ఇతర ఛార్జీలు..

జాయినింగ్​/ రెన్యువల్​ మెంబర్​షిప్​ ఫీజు- రూ. 500 ప్లస్​ ట్యాక్స్​.

ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం