తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gautam Adani: ‘‘నీ కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోతోంది’’- గౌతమ్ అదానీ

Gautam Adani: ‘‘నీ కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోతోంది’’- గౌతమ్ అదానీ

HT Telugu Desk HT Telugu

02 April 2024, 18:30 IST

google News
  • Gautam Adani: గౌతమ్ అదానీ ఇటీవల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన చిన్న మనవరాలి గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు. తన చిన్న మనవరాలి కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా చిన్నబోయిందని ఆయన ట్వీట్ చేశారు. గౌతమ్ ఆదానీ కుమారుడు కరణ్ ఆదానీ చిన్న కూతురు కావేరిని ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు. 

చిన్న మనవరాలితో గౌతమ్ అదానీ
చిన్న మనవరాలితో గౌతమ్ అదానీ

చిన్న మనవరాలితో గౌతమ్ అదానీ

Gautam Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన మనవరాలి కళ్ల మెరుపుకు ఏ సంపద కూడా సాటిరాదని అన్నారు. తన చిన్న మనవరాలు కావేరి ఫొటోను ఎక్స్ లో షేర్ చేస్తూ ఆయన ఈ కామెంట్ పెట్టారు. గౌతమ్ ఆదాని కుమారుడు కరణ్, పరిధి అదానీల మూడవ కుమార్తె కావేరి. ఆ పాప వయస్సు 14 నెలలు. లండన్ లోని సైన్స్ మ్యూజియంలోని కొత్త అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీలో తీసిన తన మనవరాలి ఫొటోను అదానీ షేర్ చేస్తూ.. 'ఈ కళ్ల మెరుపుతో పోలిస్తే ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోయింది' అని పేర్కొన్నారు.

ఒత్తిడిని తగ్గించే మార్గం

తన మనవరాళ్లతో సమయం గడపడం తన పని ఒత్తిడిని తగ్గిస్తుందని గౌతమ్ అదానీ గతంలో కూడా వ్యాఖ్యానించారు. ‘‘నా మనవరాళ్లతో గడపడం నాకు చాలా ఇష్టం. నా ఒత్తిడిని తగ్గించే అతిపెద్ద వ్యాపకం అది. నాకు రెండు ప్రపంచాలు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి పని, మరొకటి కుటుంబం. నా కుటుంబం నాకు గొప్ప బలం’’ అని గౌతమ్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల గురించి మాట్టాడుతూ, అదానీ గ్రూప్ లో సమతుల్యమైన రుణ పోర్ట్ ఫోలియో ఉందని అన్నారు. అందులో దేశీయ బ్యాంక్ ల నుంచి 29%, అంతర్జాతీయ బ్యాంక్ ల నుంచ 30%, గ్లోబల్ బాండ్స్ నుంచి 34%, ఇతరుల నుంచి 7% రుణాలు తీసుకున్నామని వివరించారు. ‘‘క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే, టీ 20 లు వచ్చి టెస్ట్ క్రికెట్ ను ఎలా ప్రభావితం చేశాయో.. అదానీ గ్రూప్ వచ్చి దేశంలోని మౌలిక వసతుల రంగాన్ని అలా ప్రభావితం చేసింది’’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

బ్యాలెన్స్డ్ బిజినెస్ గ్రూప్

"ఈ రోజు, మనకు 29% దేశీయ బ్యాంకులు, 30% ప్రపంచ బ్యాంకులు, 34% గ్లోబల్ బాండ్లు మరియు 7% ఇతరులతో సమతుల్య రుణ పోర్ట్ఫోలియో ఉంది. ఇన్ఫ్రా స్పేస్లో అభివృద్ధి యొక్క 'చల్తా హై' దృక్పథం, భారీ సమయం మరియు ఖర్చుతో భర్తీ చేయబడుతోంది, "క్రికెట్ సారూప్యతను ఉపయోగించడానికి, అదానీ గ్రూప్ టెస్ట్ క్రికెట్ను ప్రభావితం చేసిన విధంగానే మౌలిక సదుపాయాల రంగాన్ని ప్రభావితం చేసింది" అని ఆయన అన్నారు.ఈ రంగంలో అప్పటివరకు నెలకొన్న ‘చల్తా హై’ ధోరణిని అదానీ గ్రూప్ సమూలంగా మార్చిందన్నారు.

తదుపరి వ్యాసం