తెలుగు న్యూస్  /  Business  /  From Aadhaar-pan Linking To Mutual Fund Nomination, Five Things You Must Do Before March 31

March 31 tasks: మార్చి 31 లోగా ఇవి పూర్తి చేయండి. లేదంటే ఇబ్బందులు తప్పవు..

HT Telugu Desk HT Telugu

24 March 2023, 19:18 IST

  • March 31 financial tasks: మార్చి 31 అంటే ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ పనులను ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లేదా మంచి ఆదాయ అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

March 31 financial tasks: సాధారణంగా ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాల్సిన ఆర్థిక పరమైన విధులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Mutual funds nomination: మ్యుచ్యువల్ ఫండ్స్ నామినేషన్
సెబీ (Securities and Exchange Board of India SEBI) ఇటీవల ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. మ్యుచ్చువల్ ఫండ్స్ (Mutual funds) లో పెట్టుబడులు పెట్టేవారు.. తమ ఫండ్ పోర్ట్ ఫొలియోలకు మార్చి 31 లోగా నామినేషన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత పోర్టిఫోలియోలు, జాయింట్ పోర్ట్ ఫోలియోలు ఈ పరిధిలోకి వస్తాయి. కొత్త యూనిట్ హోల్డర్లు నామినేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయడం కానీ, నామినేషన్ అవసరం లేదని డిక్లరేషన్ ఇవ్వడం కానీ చేయవచ్చు. మ్యుచ్చువల్ ఫండ్ (Mutual funds) యూనిట్ హోల్డర్ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆ ఫండ్ ను నామినీ (nominee)కి ఇస్తారు.

Income Tax exemption under Section 80C: సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు

ఆదాయ పన్ను చట్టం (IT act) లోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు కోరేవారికి మార్చి 31 వరకు గడువు ఉంది. ఈ లోపు వారు పీపీఎఫ్ (Public Provident Fund PPF) లో కానీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (equity linked saving schemes ELSS) ల్లో కానీ, సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) లో కానీ పెట్టుబడులు పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు.

PAN-Aadhaar linking : పాన్ - ఆధార్ లింకింగ్

పలుమార్లు గడువును పొడగించిన అనంతరం చివరగా.. పాన్ నెంబర్ (Permanent Account Number PAN) తో ఆధార్ (Aadhaar) నెంబర్ ను అనుసంధానించుకోవడం కోసం మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ధారించారు. పాన్, ఆధార్ అనుసంధానం (PAN-Aadhaar linking) కోసం ఇంకా ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ లోపు పాన్, ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar linking) పూర్తి కానట్లయితే, ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ పని చేయదు.

High-premium LIC Policy: ఎల్ఐసీ ప్రీమియం

హై ప్రీమియం ఎల్ఐసీ పాలసీ (high-premium LIC policy) లపై పన్ను మినహాయింపు పొందడానికి కూడా మార్చి 31 చివరి తేదీ. ఈ లోపే ఎల్ఐసీ నుంచి హై ప్రీమియం పాలసీ (high-premium LIC policy) ని కొనుగోలు చేసి, పన్ను మినహాయింపు పొందండి. ఈ పన్ను మినహాయింపు సౌలభ్యం ఏప్రిల్ 1 నుంచి తొలగించబడుతుంది.

Pradhan Mantri Vaya Vandana Yojana: ప్రధాన మంత్రి వయ వందన యోజన

సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఈ ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY). ఇందులో రూ. 15 లక్షల వరకు సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టవచ్చు. వారికి 7.4% వార్షిక వడ్డీ రేటుతో క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆఖరు తేదీ మార్చి 31.