Recharge Plan : ఈ రెండు ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్ యూజర్లు అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా చూడొచ్చు
20 November 2024, 11:00 IST
Airtel Recharge Plan : ఓటీటీ కంటెంట్ కావాలనుకునేవారికి ఎయిర్‌టెల్ పలు రిఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే రెండు రిఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఫ్రీ అమెజాన్ రిఛార్జ్ ప్లాన్
ఇటీవల ఓటీటీ కంటెంట్ చూసవారి సంఖ్య పెరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటారు. కానీ టెలికాం కంపెనీలు సైతం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నాయి. ఇష్టమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూడటానికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కోసం విడిగా ఖర్చు చేయాల్సిన పని లేదు. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతో రిఛార్జ్ చేసుకుంటే ఓటీటీ సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ఇలాంటి రెండు ప్లాన్లను అందిస్తోంది. ఇవి రిఛార్జ్ చేసినప్పుడు అమెజాన్ ప్రైమ్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రిఛార్జ్ ప్లాన్లలో అనేక ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన ప్లాన్స్ ఉచిత ఓటీటీని అందిస్తున్నాయి. మీరు మీ అవసరాన్ని బట్టి రోజువారీ డేటా ప్లాన్ ఎంచుకోవచ్చు. దీనితో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఉచితంగా పొందుతారు. ఇది మాత్రమే కాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రిమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. దీనితో 22కి పైగా ఓటీటీ కంటెంట్‌ను చూడవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.838 ఓటీటీ ప్లాన్
మీరు అమెజాన్ ప్రైమ్‌ను ఉచితంగా ఆస్వాదించాలనుకుంటే ఈ రూ.838 ప్లాన్‌తో రిఛార్జ్ చేసుకోవాలి. రిఛార్జ్ చేసుకుంటే 56 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. దీంతోపాటు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. 56 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది.
మిగిలిన ప్రయోజనాలు చూస్తే.. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ 56 రోజులు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు 22 ప్లస్ ఓటీటీ కంటెంట్‌ను పొందవచ్చు. ఇది కాకుండా అపోలో 24/7 సర్కిల్ యాక్సెస్, ఉచిత హలోట్యూన్స్ మూడు నెలల పాటు అందిస్తారు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ ఓటీటీ ప్లాన్ రూ.1,199
ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు కాగా, రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 84 రోజులకు మాత్రమే లభిస్తుంది.
ఇది కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంతో 22 ప్లస్ ఓటీటీ కంటెంట్‌ను చూడొచ్చు. అపోలో 24/7 సర్కిల్‌కు యాక్సెస్, మూడు నెలల పాటు ఉచిత హలోట్యూన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ 5జీ డేటా కూడా దొరుకుతుంది.