తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fire Boltt Royale : ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Fire Boltt Royale : ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

18 November 2023, 12:05 IST

    • Fire Boltt Royale smartwatch : ఫైర్​ బోల్ట్​ సంస్థ.. కొత్త స్మార్ట్​వాచ్​ని లాంచ్​ చేసింది. ఈ ఫైర్​ బోల్ట్​ రాయల్​ వాచ్​ ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​ లాంచ్​..
ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​ లాంచ్​..

ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​ లాంచ్​..

Fire Boltt Royale smartwatch : ఫైర్​ బోల్ట్​ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్​ లాంచ్​ అయ్యింది. దీని పేరు ఫైర్​ బోల్ట్​ రాయల్​. ఈ మోడల్​ డిజైన్​ చాలా స్టైలిష్​గా ఉంది. అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఫైర్​ బోల్ట్​ రాయల్​ స్మార్ట్​వాచ్​..

ఈ ఫైర్​ బోల్ట్​ రాయల్​ వాచ్​లో మ్యూజిక్​ని స్టోర్​ చేసుకునేందుకు 4జీబీ స్టోరేజ్​ వస్తుండటం విశేషం. దీనికి మెటల్​ బాడీ ఉంటుంది. సర్క్యులర్​ డయల్​, రొటేటింగ్​ క్రౌన్​, 2 బటన్స్​ డిజైన్​ దీని సొంతం. ఇందులో 1.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఆల్వేస్​ ఆన్​ డిస్​ప్లే మోడ్​ కూడా ఉంది. ఈ గ్యాడ్జెట్​ పీక్​ బ్రైట్​నెస్​ 750 నిట్స్​.

Fire Boltt Royale launch date in India : ఇక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ మోడల్​లో హార్ట్​ రేట్​ సెన్సార్​, ఎస్​పీఓ2 మానిటర్​, స్లీప్​ ట్రాకర్​ వంటివి ఉన్నాయి. 300కుపైగా స్పోర్ట్స్​ యాక్టివిటీస్​ సపోర్ట్​ కూడా లభిస్తుంది. వీఆర్​ వర్కౌట్​ మోడ్​ హైలైట్​ అని తెలుస్తోంది. హైడ్రేషన్​ రిమైండర్స్​ కూడా ఇందులో ఉన్నాయి. అంటే.. మీరు మంచి నీరు తాగాలని, ఈ స్మార్ట్​వాచ్​ గుర్తుచేస్తుంది!

4జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​తో పాటు ఈ ఫైర్​ బోల్ట్​ కొత్త స్మార్ట్​వాచ్​లో బిల్ట్​ ఇన్​ స్పీకర్​, హ్యాండ్స్​ ఫ్రీ బ్లూటూత్​ కాలింగ్​ కోసం మైక్​, స్టాప్​వాచ్​, కాల్క్యులేటర్​, కెమెరా- మ్యూజిక్​ కంట్రోల్​, నోటిఫికేషన్స్​, వెథర్​ అప్​డేట్స్​తో పాటు అనేక ఫీచర్స్​ ఈ మోడల్​లో వస్తున్నాయి. ఇందులో 380 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

ఫైర్​ బోల్ట్​ రాయల్​ ధర ఎంతంటే..

Fire Boltt Royale price : ఫైర్​ బోల్ట్​ ప్రీమియం స్మార్ట్​వాచ్​లో భాగం ఈ రాయల్​. దీని ధర రూ. 4,999గా ఉంది. రోస్​ రెడ్​, గోల్డ్​, బ్లాక్​, బ్లూ, సిల్వర్​ కలర్స్​లో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ నెల 25న ఈ మోడల్​ సేల్స్​ ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న వారు.. అమెజాన్​తో పాటు ఫైర్​ బోల్ట్​ అధికారిక వెబ్​సైట్​లో ఈ వాచ్​ని కొనుగోలు చేసుకోవచ్చు.

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​' థీమ్​తో స్మార్ట్​వాచ్..

ఇంగ్లీష్​ టీవీ షో 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​'కు సపరేట్​ ఫ్యాన్​బేస్​ ఉంటుంది. ఈ జీఓటీ థీమ్​తో ఓ స్మార్ట్​వాచ్​ను రూపొందించింది పెబుల్​ సంస్థ. ఇందులో 1.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. బ్లూటూత్​ ఫీచర్​ ద్వారా ఫోన్స్​ ఆన్సర్​ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం