తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Smartwatch | క్లాసీ లుక్‍తో ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్లు ఇవే

New Smartwatch | క్లాసీ లుక్‍తో ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్లు ఇవే

22 March 2023, 8:39 IST

google News
  • Fire-Boltt Legend smartwatch: ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. క్లాసీ లుక్‍తో ఈ వాచ్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.

New Smartwatch | క్లాసీ లుక్‍తో ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)
New Smartwatch | క్లాసీ లుక్‍తో ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)

New Smartwatch | క్లాసీ లుక్‍తో ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Legend smartwatch: విభిన్న డిజైన్‍లతో దేశీయ బ్రాండ్ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) స్మార్ట్‌వాచ్‍లను (New Smartwatches) తీసుకొస్తూనే ఉంది. తాజాగా క్లాసీ లుక్ ఉండేలా మినిమలిస్టిక్ డిజైన్‍తో ఫైర్ బోల్డ్ లెజెండ్ (Fire Boltt Legend) స్మార్ట్‌వాచ్‍ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వచ్చింది. ఇప్పటికే సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా ఐదు కలర్ ఆప్షన్‍లలో ఫైర్ బోల్ట్ లెెజెండ్ స్మార్ట్‌వాచ్ లభిస్తోంది.

ఫైర్ బోల్ట్ లెజెండ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fire-Boltt Legend smartwatch Features: 1.39 ఇంచుల హెచ్‍డీ రెజల్యూషన్ రౌండ్ షేప్డ్ డిస్‍ప్లేను ఫైర్ బోల్డ్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. విభిన్నమైన ఫేస్ వాచ్‍లతో వస్తోంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడేలా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తోంది. ఇందుకోసం ఈ స్మార్ట్‌వాచ్‍లో మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి.

Fire-Boltt Legend smartwatch: రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ సహా మొత్తంగా 123 స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉంటాయి. స్టెప్స్, క్యాలరీస్ బర్న్, డిస్టెన్స్‌ను మీరు ట్రాక్ చేసుకోవచ్చు.

Fire-Boltt Legend smartwatch: బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్‍లోనే నోటిఫికేషన్లను చూడవచ్చు. ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ చెబుతోంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఎక్కువగా వాడితే 2 రోజుల వరకు బ్యాటరీ రావొచ్చు. ఇక గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది.

ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ ధర

Fire-Boltt Legend Price: ఫైర్ బోల్ట్ లెజెండ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,499గా ఉంది. ఫైర్ బోల్ట్ కంపెనీ వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లోనూ రానుంది. బ్లాక్, సిల్వర్ గ్రే, గోల్డ్ పింక్, షాంపైన్ గోల్డ్, లైట్ గోల్డ్ రెడ్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం