తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fed Hikes 75 Bps: 0.75 శాతం వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. ఇదే చివరి పెంపా?

Fed Hikes 75 Bps: 0.75 శాతం వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. ఇదే చివరి పెంపా?

HT Telugu Desk HT Telugu

03 November 2022, 10:28 IST

google News
  • Fed Hikes 75 Bps: అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగోసారి వడ్డీ రేట్లు పెంచింది.

పావెల్ ప్రెస్ కాన్ఫరెన్స్
పావెల్ ప్రెస్ కాన్ఫరెన్స్ (REUTERS)

పావెల్ ప్రెస్ కాన్ఫరెన్స్

ద్రవ్యోల్భణాన్ని అదుపులోకి తెచ్చేందుకు మరోసారి ఫెడ్ కఠిన చర్య అవలంబించింది. 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచింది. ఈ మధ్య కాలంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇలా వడ్డీ రేట్లు పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. అయితే వడ్డీ రేట్ల పెంపు తుది దశకు చేరుకుందన్న సంకేతాలు ఇవ్వడం కాస్త ఉపశమనంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో అమెరికాలో వడ్డీ రేట్ల శ్రేణి 3-3.25 నుంచి 3.75 - 4 శాతానికి చేరుకున్నాయి.

ద్రవ్యోల్భణాన్ని 2 శాతానికి తేవడానికి ఇలాంటి రేట్ల పెంపు ఇంకా అవసరమని సెంట్రల్ బ్యాంక్ గతంలో చెప్పినప్పటికీ.. ప్రస్తుత చర్యలు తగిన పరిమితిలో ఉన్నాయని చెప్పింది.

గృహ నిర్మాణం, తయారీ రంగం వంటి సెగ్మెంట్లు ఇప్పటికే మందగించాయి. అయినప్పటికీ ద్రవ్యోల్భణం, ఉద్యోగాల గణాంకాలు ఇంకా ఆందోళనకర రీతిలోనే ఉన్నాయి.

తదుపరి డిసెంబరులో జరిగే సమావేశంలో ఫెడ్ ఈస్థాయిలో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని, 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరగవచ్చని వాల్‌స్ట్రీట్ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికాలో వడ్డీ రేట్లు ఈస్థాయికి చేరడం 2008 తరువాత ఇదే తొలిసారి. ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దానిని అదుపులోకి తెచ్చేందుకు ఫెడరల్ రిజర్వ్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ అధిక ధరలు మిడ్ టర్మ్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

ఫెడ్ వడ్డీ రేటు పెరుగుదలను తగ్గించే అంశాన్ని రాబోయే నెలల్లో నిర్ణయించుకోవచ్చని పావెల్ సూచించారు. ద్రవ్యోల్బణం రేటును అదుపులో ఉంచడానికి ఫెడ్ చేస్తున్న పోరాటంలో విజయాన్ని ప్రకటించడానికి కూడా దగ్గరలో లేమని అతను స్పష్టం చేశారు. ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉంది. అయితే ఇది తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపిస్తుండడంతో వచ్చే ఫెడ్ సమావేశంలో మరీ కఠినంగా వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం