తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byju's Lays Off: బైజూస్ నుంచి మరో 1500 మంది ఉద్యోగులు ఔట్

Byju's lays off: బైజూస్ నుంచి మరో 1500 మంది ఉద్యోగులు ఔట్

HT Telugu Desk HT Telugu

02 February 2023, 20:10 IST

google News
  • Byju's lays off: ఆన్ లైన్ విద్యలో మార్కెట్ లీడర్ గా ఉన్న బైజూస్ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది.

బైజూస్ ఫౌండర్ బైజు రవీంద్రన్
బైజూస్ ఫౌండర్ బైజు రవీంద్రన్

బైజూస్ ఫౌండర్ బైజు రవీంద్రన్

Byju's lays off: ఆన్ లైన్ విద్యలో అచిర కాలంలోనే యూనీకార్న్ స్టార్ట్ అప్ గా ఎదిగిన బైజూస్ (Byju's) మరోసారి తమ ఉద్యోగుల్లో కొందరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది.

Byju's lays off: ఈ సారి 1500 మంది

ఎడ్యు టెక్ (ా సంస్థ బైజూస్ (Byju's) 1500 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. గత అక్టోబర్ లో ఇప్పటికే 2500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్ (Byju's), తాజాగా మరో 1500 మందికి ఉద్వాసన పలికింది. ఈ లే ఆఫ్స్ లో ఎక్కువగా డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాల నుంచి ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఆర్థిక మాంద్యం తరుముకువస్తున్న నేపథ్యంలో మెరుగైన వ్యయ నిర్వహణ కోసమే సంస్థ (Byju's) ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 అక్టోబర్ లో సుమారు 2500 మందికి, అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 5% మందికి బైజూస్ (Byju's) లే ఆఫ్ ప్రకటించింది. ఇకపై బైజూస్ లో లేఆఫ్స్ ఉండవని అప్పుడు బైజూస్ (Byju's) వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ హామీ ఇచ్చాడు. కానీ, 3 నెలలు ముగియగానే మరో 1500 మందిని తొలగించాడు.

Byju's lays off: ఔట్ సోర్సింగ్ కోసం..

మెరుగైన వ్యయ నిర్వహణ నిర్ణయాల్లో భాగంగా లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఆపరేషన్స్ … తదితర విభాగాల్లోని కొన్ని విధులను ఔట్ సోర్సింగ్ చేయాలని బైజూస్ (Byju's) భావిస్తోంది. అందులో భాగంగానే, ఆయా విభాగాల్లో అనసవరమని భావిస్తున్న ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా ఉద్యోగులకు ఈ మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా కాకుండా, నేరుగా కార్యాలయాలకు పిలిచి పింక్ స్లిప్స్ ఇస్తున్నారని వెల్లడించాయి.

తదుపరి వ్యాసం