తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Disney+: డిస్నీ+ యూజర్లు కూడా ఇక పాస్ వర్డ్ ను షేర్ చేసుకోవడం కుదరదు.. నెట్ ఫ్లిక్స్ రూట్ లోనే డిస్నీ+

Disney+: డిస్నీ+ యూజర్లు కూడా ఇక పాస్ వర్డ్ ను షేర్ చేసుకోవడం కుదరదు.. నెట్ ఫ్లిక్స్ రూట్ లోనే డిస్నీ+

HT Telugu Desk HT Telugu

05 April 2024, 17:26 IST

google News
  • Disney+ password restrictions: ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ తరహాలోనే ఇక డిస్నీ+ కూడా పాస్ వర్డ్ షేరింగ్ ను నిరోధించాలని నిర్ణయించింది. డిస్నీ స్ట్రీమింగ్ ఆదాయాన్ని పెంచడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు డిస్నీ సీఈఓ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

యూజర్లు పాస్ వర్డ్ ను షేర్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ + నిర్ణయించింది. పాస్ వర్డ్ షేరింగ్ లో ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు డిస్నీ + సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. జూన్ 2024 నుంచి పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. అయితే, ఈ పాస్ వర్డ్ షేరింగ్ ను పూర్తిగా నిరోధిస్తారా? లేక కొంత పరిమితం చేస్తారా? అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

జూన్ నుంచి ప్రారంభం

కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఈ జూన్ లో ఈ పాస్ వర్డ్ షేరింగ్ రెస్ట్రిక్షన్స్ అమలు చేస్తామని, సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలను విస్తరిస్తామని తెలిపారు. ‘‘జూన్ లో పాస్ వర్డ్ షేరింగ్ లో తొలి అడుగు వేయబోతున్నాం. మొదట కొన్ని దేశాల్లో అమలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తాం. తద్వారా, సంస్థ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం’’ అని డిస్నీ + సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు.

తదుపరి వ్యాసం