తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Coal India Q3 Results: అంచనాలకు మించి కోల్ ఇండియా లాభాలు; డివిడెండ్ ఎంతో తెలుసా?

Coal India Q3 results: అంచనాలకు మించి కోల్ ఇండియా లాభాలు; డివిడెండ్ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

08 January 2024, 20:36 IST

google News
    • Coal India Q3 results: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (Q3FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q3 లో అంచనాలను మించిన లాభాలను కోల్ ఇండియా (Coal India) సముపార్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coal India Q3 results: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (Q3FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q3 లో కోల్ ఇండియా (Coal India) రూ. 7,755.55 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

Coal India Q3 results: గత Q3 కన్నా..

ఈ Q3 లో రూ. 7,755.55 కోట్ల నికర లాభాలను (Coal India Q3 results) ఆర్జించిన కోల్ ఇండియా (Coal India) గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన లాభాల కన్నా సుమారు 70% అధిక నికర లాభాలను ఆర్జించింది. గత Q3 లో కోల్ ఇండియా నికర లాభాలు రూ. 4,558.39 కోట్లు. విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్న కారణంగా విద్యుత్ వినియోగానికి డిమాండ్ పెరగడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గుకు డిమాండ్ పెరిగింది. దాంతో, కోల్ ఇండియా (Coal India) బొగ్గు ఉత్పత్తిని పెంచి, గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఈ Q3 లో రూ. 7,678.03 కోట్ల నికర లాభాలను కోల్ ఇండియా సముపార్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాను మించి రూ. 7,755.55 కోట్ల నికర లాభాలను కోల్ ఇండియా (Coal India) ఆర్జించింది.

Coal India Q3 results: Q2 లో ..

ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో కోల్ ఇండియా నికర లాభాలు రూ. 6,043.55 కోట్లు. Q2 కన్నా Q3తో (Coal India Q3 results) సంస్థ లాభాలు 28% పెరిగాయి. ఈ Q3 లో కోల్ ఇండియా (Coal India) ఆదాయం రూ. 35,169 కోట్లు. గత Q3 లో సంస్థ ఆదాయం రూ. 28,433 కోట్లుగా ఉంది. అలాగే, ఈ Q3లో కోల్ ఇండియా నికర నిర్వహణ ఖర్చులు రూ. 26,246.44 కోట్లు. గత Q3 లో ఈ ఖర్చులు రూ. 22,780.95 కోట్లు.

Coal India Q3 results: డివిడెండ్

మదుపర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో తాత్కాలిక డివిడెండ్ ను ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించింది. ఈ రెండో తాత్కాలిక డివిడెండ్ ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5.25 గా నిర్ణయించారు. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ ను ఫిబ్రవరి 8 గా నిర్ణయించారు. కోల్ ఇండియా (Coal India) షేరు ధర మంగళవారం 0.49% తగ్గి, రూ. 224.75 వద్ద ముగిసింది.

టాపిక్

తదుపరి వ్యాసం