Budget 2024 Highlights: ఆదాయ పన్ను స్లాబ్ ల్లో ఎలాంటి మార్పు లేదు: ఆర్థిక మంత్రి
01 February 2024, 12:10 IST
- ఆదాయ పన్ను స్లాబ్ ల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. 2024 25 సంవత్సర మధ్యతర బడ్జెట్ ను ఆమె గురువారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ టీమ్
2024 లోక్ సభ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్ కాగా, మోదీ ప్రభుత్వం రెండోసారి ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కావడం గమనార్హం. 2024-25 ఎన్నికలకు ముందు బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిశారు. ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పు లేదు
కాగా, ఆదాయ పన్ను స్లాబ్ లకు సంబంధించి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం లో ఆదాయ పన్ను స్లాబ్ ల్లో ఎలాంటి మార్పులు చేయడ లేదని, గత విధానంలోనే పన్ను సేకరణ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం వృద్ధి చెందుతుందని అధికారిక అంచనాలు అంచనా వేస్తున్నాయి.
సవాళ్లను అధిగమించి..
ప్రభుత్వం 2014 నుంచి అనేక సవాళ్లను అధిగమించి నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రజా అనుకూల సంస్కరణలు, ఉద్యోగ కల్పన, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు అనుకూల పరిస్థితులను పెంపొందించడంపై దృష్టి సారించారు. అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలకు చేరాయి. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రభుత్వం తన అభివృద్ధి తత్వాన్ని బలోపేతం చేసింది, సామాజిక మరియు భౌగోళిక రంగాలలో సమ్మిళితత్వంపై దృష్టి సారించింది.