BSNL: రూ.4వేలలోపు ధరలోనే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‍బ్యాండ్ సంవత్సరం ప్లాన్.. ఒక నెల ఉచితం.. పరిమిత కాల ఆఫర్!
25 May 2023, 9:53 IST
- BSNL Broadband: ఓ వార్షిక బ్రాండ్‍బ్యాండ్ ప్లాన్‍ను రూ.4వేలలోపు ధరకే బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‍ను తీసుకుంటే ఓ నెల వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తోంది. వివరాలివే..
BSNL: రూ.4వేలలోపు ధరలోనే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‍బ్యాండ్ సంవత్సరం ప్లాన్..
BSNL Bharat Fiber Broadband: ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. వివిధ రకాల భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను అందుబాటులో ఉంచింది. కొన్ని ప్లాన్‍లను తక్కువ ధరకే మంచి ప్రయోజనాలతో అందిస్తోంది. కాగా, భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ కస్టమర్ల కోసం ఓ సంవత్సరం ప్లాన్‍ను రూ.4,000లోపు ధరలోనే బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ వార్షిక ప్లాన్‍ను తీసుకుంటే మరో నెల సర్వీస్ కూడా ఉచితంగా ఇస్తోంది బీఎస్ఎన్ఎల్. అంటే, ఈ ప్లాన్ కింద 13 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఆఫర్ జూలై 30 వరకు ఉంటుందని భారత్ ఫైబర్ తన వెబ్‍సైట్‍లో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చౌకైన సంవత్సర బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇవే.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‍బ్యాండ్ సంవత్సరం ప్లాన్
బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ 12 నెలల ‘ఫైబర్ ఎంట్రీ’ ప్లాన్ ధర రూ.3,948గా ఉంది. ఈ ప్లాన్ తీసుకుంటే 20 ఎంబీపీఎస్ వేగంతో ప్రతీ నెల 1,000జీబీ డేటా లభిస్తుంది. ఒకవేళ నెలలో 1,000 జీబీ అయిపోయాక 4ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 12 నెలలుగా ఉంది. అయితే, ప్రస్తుతం ఈ 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఒక నెల సర్వీస్ ఉచితంగా లభిస్తుంది. అంటే మొత్తంగా 13 నెలల ప్లాన్‍గా ఇది ప్రస్తుతం ఉంది. ఈ వార్షిక ప్లాన్ ఆఫర్ జూలై 30 వరకే ఉండనుంది. భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ వెబ్‍సైట్‍లో ఈ విషయాన్ని పేర్కొంది.
ఈ వార్షిక ప్లాన్ ధర రూ.3,948గా ఉండగా.. జీఎస్‍టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ అందుబాటు వివరాల కోసం భారత్ ఫైబర్ వెబ్‍సైట్‍లో చూడండి. లేకపోతే దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‍ను సంప్రదించవచ్చు.
ప్రస్తుతం ఫైబర్ ఎంట్రీ ఒక నెల ప్లాన్ ధర రూ.329గా ఉంది. ప్రతీ నెల ఈ ప్లాన్ తీసుకున్నా సంవత్సరానికి రూ.3,948 (జీఎస్‍టీ అదనం) అవుతుంది. అయితే, వార్షిక ప్లాన్ ప్రస్తుతం ఒకేసారి తీసుకుంటే ఒక నెల ఉచితంగా లభిస్తుంది. దీంతో సంవత్సరం ప్లాన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. కాగా, ఈ ఫైబర్ ఎంట్రీ నెలవారి ప్లాన్ కూడా జూలై 30 వరకే అందుబాటులో ఉంటుందని భారత్ ఫైబర్ తన వెబ్‍సైట్‍లో పేర్కొంది.
టాపిక్