తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Britannia Q2 Results 2022 : 28.5శాతం పెరిగిన బ్రిటానియా లాభాలు..

Britannia Q2 results 2022 : 28.5శాతం పెరిగిన బ్రిటానియా లాభాలు..

05 November 2022, 6:33 IST

    • Britannia Q2 results 2022 : క్యూ2లో బ్రిటానియా లాభాలు 28.5శాతం పెరిగాయి. ఈ మేరకు త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది ఈ ఎఫ్​ఎంసీజీ సంస్థ.
Britannia.mint
Britannia.mint

Britannia.mint

Britannia Q2 results 2022 : 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది దిగ్గజ ఎఫ్​ఎంసీజీ సంస్థ బ్రిటానియా. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో బ్రిటానియా నెట్​ ప్రాఫిట్​ 28.5శాతం పెరిగి రూ. 490.58కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ నెట్​ ప్రాఫిట్​ రూ. 381.84కోట్లుగా ఉండేది.

సంస్థ కన్సాలిడేటెడ్​ రెవెన్యూ.. 21.4శాతం వృద్ధిచెంది రూ. 4,379.61కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 3,607.37కోట్లుగా నమోదైంది.

"కొన్ని నెలలుగా వృద్ధి అనేది చాలా సానుకూలంగా ఉంది. మా "గో టు మార్కెట్​" స్ట్రాటజీతో పాటు డిస్ట్రిబ్యూషన్​ రీచ్​ అనేది బాగా పెరిగింది. అందుకే టాప్​లైన్​ గ్రోత్​.. 22శాతం(ఇయర్​ ఆన్​ ఇయర్​), 19శాతం(క్వార్టర్​ ఆన్​ క్వార్టర్​) వృద్ధిచెందింది. 38 త్రైమాసికాలుగా మా మార్కెట్​ షేర్​ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అది 15ఏళ్ల గరిష్ఠంలో ఉంది. ఇది మా బ్రాండ్​ వాల్యూకు సంకేతం," అని బ్రిటానియా ఎండీ వరుణ్​​ బెర్రి తెలిపారు.

టైటాన్​ సంస్థ క్యూ2 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

"ప్రత్యక్షంగా డిస్ట్రిబ్యూషన్లు చేసేందుకు మా వద్ద 26లక్షల ఔట్​లెట్​లు ఉన్నాయి. గత 6 నెలల్లోనే 4లక్షల ఔట్​లెట్​లను కొత్తగా తీసుకొచ్చాము. గ్రామీణ భారతంలో ప్రయాణం సాఫీగా సాగుతోంది. అక్కడ 28వేలకుపైగా డీలర్లు ఉన్నారు. అందుకే మా మార్కెట్​ షేర్​ పెరుగుతోంది," అని వరుణ్​ స్పష్టం చేశారు.

ఇక క్యూ2లో బ్రిటానియా ఎబిట్​డా రూ. 711.7కోట్లుగా నిలిచింది. ఇయర్​ ఆన్​ ఇయర్​తో పోల్చుకుంటే(రూ. 558.3కోట్లు) అది 27.5శాతం పెరిగినట్టు.

బ్రిటానియా షేరు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి.. బీఎస్​ఈలో బ్రిటానియా షేరు ధర రూ. 3,797 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 0.36శాతమే పెరిగింది. నెలలో 0.78శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఈ ఏడాదిలో బ్రిటానియా స్టాక్​ 4.96శాతం పెరిగింది.

నైకా సంస్థ క్యూ2 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం