తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Motor's Q2 Pat Rises By 47%: లాభాల బాటన టీవీఎస్ మోటార్

TVS Motor's Q2 PAT rises by 47%: లాభాల బాటన టీవీఎస్ మోటార్

HT Telugu Desk HT Telugu

04 November 2022, 22:20 IST

  • TVS Motor's Q2 PAT rises by 47%: టీవీఎస్ మోటార్స్ Q2FY23 ఫలితాలను విడుదల చేసింది. సంస్థ నికర లాభాలు గత సంవత్సరం Q2తో పోలిస్తే 47% పెరిగాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TVS Motor's Q2 PAT rises by 47%: టీవీఎస్ మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10,27,437 యూనిట్ల వాహానాలను విక్రయించింది. గత సంవత్సరం Q2 లో సంస్థ అమ్మిన వాహనాల సంఖ్య 9,16,705 యూనిట్లు. అలాగే ఈ Q2FY21లో 9,06,791 వాహనాలు అమ్ముడయ్యాయి.

TVS Motor's Q2 PAT rises by 47%: ద్విచక్ర వాహన దిగ్గజం

టీవీఎస్ మోటార్స్ భారత ద్వి చక్ర వాహన రంగంలో దిగ్గజ సంస్థ. అనువైన ధరల్లో, మంచి మైలేజీతో, నాణ్యమైన వాహనాలను అందిస్తుందన్న పేరు TVS Motor Company కి ఉంది. సంస్థ ఈ Q2 (Q2FY23)లో రూ. 407.47 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం Q2లో ఈ సంస్థ రూ. 277.60 కోట్ల లాభాలను సాధించింది. అంటే, గత Q2తో పోలిస్తే, ఈ Q2లో దాదాపు 47% పెంపును నమోదు చేసింది.

TVS Motor's Q2 PAT rises by 47%: పెరిగిన ఆదాయం..

ఈ Q2లో సంస్థ ఆదాయం రూ. 7219.18 కోట్లు. ఇది గత సంవత్సరం Q2 కన్నా 28.47% అధికం. గత సంవత్సరం Q2లో సంస్థ ఆదాయం రూ. 5619.14 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురైన ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను ఎదుర్కొని ఈ ఆదాయం సాధించగలిగామని టీవీఎస్ పేర్కొంది. TVS Ronin తో పాటు కొత్తగా TVS iQube Electric వాహనాల ఉత్పత్తిని పెంచే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహానాల ఆర్ అండ్ డీ లో భారీగా పెట్టుబడులు పెడ్తున్నట్లు వెల్లడించింది.

తదుపరి వ్యాసం