తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Smartphones: 20 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్; ఆమెజాన్ లో ఆఫర్స్ కూడా..

Best smartphones: 20 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్; ఆమెజాన్ లో ఆఫర్స్ కూడా..

HT Telugu Desk HT Telugu

22 November 2023, 17:08 IST

  • Best smartphones: రూ. 20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న టాప్ ఫోన్‌లలో రెడ్‌మి నోట్ 12 5G, రియల్‌మీ 11 5G, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G, ఒప్పొ ఏ 79 5G, లావా అగ్ని 2 5G ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (realme)

ప్రతీకాత్మక చిత్రం

Best smartphones: పండుగ సీజన్ ముగిసినప్పటికీ, అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ లను అందించడం కొనసాగిస్తోంది. ఒకవేళ ఇప్పుడు మీరు రూ. 20 వేల లోపు ధరలో అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మంచి స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకుంటే, ఈ కింద పేర్కొన్న స్మార్ట్ ఫోన్స్ ను పరిశీలించండి.

Redmi Note 12 5G: రెడ్ మి నోట్ 12 5G

రెడ్ మి నోట్ 12 5G ధర ఆమెజాన్ లో ప్రస్తుతం రూ.18,999గా ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇది 1080x2400 రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌ ను అమర్చారు. ఇందులో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ లెన్స్, 8MP లెన్స్, 2MP లెన్స్ ఉన్నాయి. ఇందులో 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో 4GB, 6GB, 8GB RAM వేరియంట్లు ఉన్నాయి. అలాగే, 5000 బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్న Redmi Note 12 5G సరికొత్త ఫీచర్లు, అప్ డేట్స్ తో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

realme 11 5G: రియల్‌ మి 11 5G

ఆమెజాన్ లో రియల్‌ మి 11 5G ప్రస్తుతం రూ. 18,599 లకు లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇది 8 GB RAM, 256GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇందులో డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్‌ ను అమర్చారు. ఇందులో వెనుక 108MP, 2MP, 16MP లతో ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీ వేగవంతమైన 67W SUPERVOOC ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది, కేవలం 17 నిమిషాల్లో 0-50 శాతం అందిస్తుంది. డైనమిక్ రిఫ్రెష్‌తో కూడిన 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ను ఇందులో అమర్చారు.

OnePlus Nord CE 3 Lite 5G: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5 జీ

ఆమెజాన్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 19,999 లకు లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇందులో వివిధ షూటింగ్ మోడ్‌లతో 108 MP మెయిన్ కెమెరా ఉంది. దీని 6.72-అంగుళాల డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్ OS పై ఇది రన్ అవుతోంది. ఇందులో 67W SUPERVOOC ఛార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీని అమర్చారు.

Oppo A79 5G: ఒప్పొ ఏ 79 5 జీ

ఒప్పొ ఏ 79 5 జీ (Oppo A79 5G) స్మార్ట్ ఫోన్ ఆమెజాన్ లో రూ 19,999 లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లో AI పవర్ సేవింగ్‌తో 5000 mAh బ్యాటరీ ఉంది.ఈ ఫోన్ లో 50 MP AI రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ లో 8GB RAM, 128GB ROM ఉన్నాయి. ఈ ఒప్పొ ఏ 79 5 జీ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల FHD+ 90Hz వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

తదుపరి వ్యాసం