తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy: ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు: యాక్సిస్ సెక్యూరిటీస్

Stocks to Buy: ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు: యాక్సిస్ సెక్యూరిటీస్

10 April 2023, 16:31 IST

google News
    • Axis Securities Recommendations: కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‍లను యాక్సిస్ సెక్యూరిటీస్ సూచించింది. స్టాక్‍ల టార్గెట్ ధరను వెల్లడించింది.
Stocks to Buy: ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు: యాక్సిస్ సెక్యూరిటీస్
Stocks to Buy: ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు: యాక్సిస్ సెక్యూరిటీస్

Stocks to Buy: ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు: యాక్సిస్ సెక్యూరిటీస్

Axis Securities Recommendations: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం బ్రోకరేజ్ సంస్థ యాక్సిక్ సెక్యూరిటీస్ (Axis Securities) కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‍లను సూచించింది. ఏప్రిల్‍లో కొనాల్సిన స్టాక్‍ల జాబితాలను వెల్లడించింది. ఈ స్టాక్స్ ఇప్పుడు కొంటే లాభాలను పొందే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈ స్టాక్స్ ఈ ఏడాది సరిగా పర్ఫార్మ్ చేయలేదని, రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, స్టాక్ మార్కెట్‍లో ఏ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు అయినా ఇన్వెస్టర్లు పూర్తి వివరాలను తెలుకోవాలి. కంపెనీ వ్యాపారం, ఆర్థిక ఫలితాలతో పాటు చాలా విషయాల గురించి తప్పకుండా రీసెర్చ్ చేయాలి. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలి. కాగా, రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉన్న 6 మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‍లను యాక్సిస్ సెక్యూరిటీస్ తాజాగా రెకమెండ్ చేసింది. వాటి వివరాలు ఇవే.

ప్రజ్ ఇండస్ట్రీస్ (Praj Industries)

స్మాల్ క్యాప్ స్టాక్ అయిన ప్రజ్ ఇండస్ట్రీస్ ఒక సంవత్సరం కాలంలో రూ.550కు చేరుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంటే ప్రస్తుత ధర (రూ.342)తో పోలిస్తే ఇది 61శాతం అధికంగా ఉంది. ఎనర్జీ, అగ్రి ప్రాసెస్, ఎన్విరాన్‍మెంట్ సహా మరిన్ని ఇంజినీరింగ్ సెల్యూషన్‍లను ఈ కంపెనీ అందిస్తుంటుంది. ముఖ్యంగా ఇథనాల్ అంశం ఈ స్టాక్‍కు కీలకంగా ఉంది.

అశోక్ లేల్యాండ్ (Ashok Leyland)

మిడ్‍క్యాప్ స్టాక్ అయిన అశోక్ లేల్యాండ్ టార్గెట్ ధరను రూ.175గా యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకటించింది. అంటే ప్రస్తుత షేర్ ధర నుంచి 26శాతం పెరుగుతుందని అంచనా వేసింది. హెవీ కమర్షియల్ వాహనాలతో పాటు లైట్ వెహికల్ కమర్షియల్ వాహనాలపై ఆ కంపెనీ దృష్టి సారిస్తుండడం సానుకూల అంశంగా పేర్కొంది.

దాల్మియా భారత్ (Dalmia Bharat)

మిడ్ క్యాప్ సిమెంట్ స్టాక్ దాల్మియా భారత్ టార్గెట్ ధరను రూ.2,260గా యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. అంటే ప్రస్తుత ధర నుంచి 15 శాతం పెరుగుతుందని వెల్లడించింది. రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఈ కంపెనీ మంచి లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అయితే ఉత్పత్తి ఖర్చులు పెరిగితే లాభాలపై ప్రభావం పడొచ్చని, ఇది రిస్క్ గా ఉందని తెలిపింది.

వరుణ్ బేవరేజెస్ (Varun Beverages)

మిడ్ క్యాప్ స్టాక్ వరుణ్ బేవరేజెస్ ఒక్క ఏడాదిలో 12 శాతం పెరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.1,550గా నిర్ణయించింది. ఆ కంపెనీ రెవన్యూ వచ్చే క్వార్టర్లలో అధికమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

పాలిక్యాబ్ ఇండియా (Polycab India)

కేబుల్స్ తయారీ మిడ్ క్యాప్ సంస్థ పాలిక్యాబ్ ఇండియా స్టాక్ ప్రస్తుత ధర నుంచి 18 శాతం పెరిగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రస్తుతం పాలిక్యాబ్ ఇండియా స్టాక్ ధర రూ.2,981గా ఉంది. ఈ సంస్థకు డిస్ట్రిబ్యూషన్ నెట్‍వర్క్ బలంగా ఉందని, బ్రాండ్ పేరు కూడా బాగుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. దీంతో పాలిక్యాబ్ సేల్స్ మరింత అధికమవుతాయని, మార్కెట్ షేర్ పెరుగుతుందని అంచనా వేసింది.

ఫెడరల్ బ్యాంక్ (Federal Bank)

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను రూ.170గా యాక్సిస్ సెక్యూరిటీస్ సెట్ చేసింది. ప్రస్తుత ధర నుంచి 28 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. లోన్‍ల విషయంలో ఈ బ్యాంకు మెరుగవుతోందని అభిప్రాయపడింది.

గమనిక: ఇవి బ్రేకరేజ్ సంస్థ అభిప్రాయాలు, రెకమెండేషన్లు మాత్రమే. ఇది సమాచారం కోసం రాసిన కథనం. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా కంపెనీ స్టాక్‍లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు పూర్తిస్థాయి ఎనాలసిస్ చేయాలి. కంపెనీ ఫండమెంటల్స్, ఆర్థిక ఫలితాలతో పాటు అన్ని వివరాలు తెలుసుకోవాలి. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహాలు తీసుకోవాలి.

తదుపరి వ్యాసం