తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai I20 New Variant : సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​..

Hyundai i20 new variant : సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

05 February 2024, 15:42 IST

    • Hyundai i20 Sportz (O) price : సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​ అయ్యింది. దాని పేరు హ్యుందాయ్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ).
సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​..
సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​..

సన్​రూఫ్​ ఫీచర్​తో హ్యుందాయ్​ ఐ20 కొత్త వేరియంట్​ లాంచ్​..

Hyundai i20 Sportz on road price in Hyderabad : ఐ20 హ్యాచ్​బ్యాక్​.. హ్యుందాయ్​ మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఇక ఇప్పుడు.. ఈ మోడల్​లో ఓ కొత్త వేరియంట్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దాని పేరు హ్యుందాయ్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ). ఈ కొత్త వేరియంట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

హ్యుందాయ్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ) విశేషాలు..

హ్యుందాయ్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ) సింగిల్​ టోన్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.73లక్షలు. డ్యూయెల్​ టోన్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.88లక్షలు. ఇందులో మేనయువల్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ మాత్రమే ఉంది.

తాజా లాంచ్​తో.. హ్యుందాయ్​ ఐ20లో 6 వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఎరా, ఆస్టా, ఆస్టా (ఓ), మాగ్నా, స్పోర్ట్జ్​, స్పోర్ట్జ్​ (ఓ). ఐ20 హ్యాచ్​బ్యాక్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.04లక్షలు- రూ. 11.21లక్షల మధ్యలో ఉంటుంది.

Hyundai i20 Sportz (0) variant : ఇక.. స్టాండర్డ్​ స్పోర్ట్జ్​ వేరియంట్​ కన్నా.. కొత్త వేరియంట్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ) ధర రూ. 35వేలు ఎక్కువే. ఎక్స్​ట్రా ఖర్చుతో.. కస్టమర్లకు మూడు కొత్త ఫీచర్స్​ లభిస్తున్నాయి. అవి.. వయర్​లెస్​ ఛార్జర్​, ఆర్మ్​రెస్ట్​, డోర్స్​కి లెథరెట్​ ఫినిష్​, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ సన్​రూఫ్​.

ఈ హ్యుందాయ్​ ఐ20 స్పోర్ట్జ్​ (ఓ)లో 1.2 లీటర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 82 హెచ్​పీ పవర్​ని, 115 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందాక చెప్పినట్టే.. ఇందులో 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ ఉంటుంది. ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్​ లేదు.

Hyundai i20 Sportz new variant price : కొత్త వేరియంట్​ ఎంట్రీతో.. హ్యుందాయ్​ ఐ20 మరింత అట్రాక్టివ్​గా మారుతుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. కొత్త ఫీచర్స్​తో కూడిన ఈ స్పోర్ట్జ్​ (ఓ) వేరియంట్​.. కస్టమర్లను ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది.

హ్యుందాయ్​ మోటార్​ ఇండియా ఐపీఓ వచ్చేస్తోంది..!

Hyundai Motor India IPO : భారతీయ ఆటోమొబైల్​ మార్కెట్​లోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి హ్యుందాయ్​ మోటార్స్​. సౌత్​ కొరియాకు చెందిన ఈ హ్యుందాయ్​ మోటార్​​ ఇండియాకు సంబంధించిన ఓ కీలక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. స్టాక్​ మార్కెట్​లోకి త్వరలోనే అతిపెద్ద ఐపీఓని తీసుకురావాలని హ్యుందాయ్​ మోటార్​​ ఇండియా ప్లాన్​ చేస్తోందట. దీపావళి (నవంబర్​) నాటికి, ఈ ఐపీఓని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఈ మేరకు.. ప్రముఖ వార్తా సంస్థ ఎకనామిక్​ టైమ్స్​.. ఓ నివేదికలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం