తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2025 Kia Carnival Hybrid : సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ ఇదిగో..

2025 Kia Carnival Hybrid : సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ ఇదిగో..

Sharath Chitturi HT Telugu

10 February 2024, 13:30 IST

    • Kia Carnival Hybrid 2025 : సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ని రివీల్​ చేసింది కియా మోటార్స్​. ఈ వెహికిల్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ ఇదిగో..
సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ ఇదిగో..

సూపర్​ స్టైలిష్​ కియా కార్నివాల్​ హైబ్రీడ్​ ఇదిగో..

Kia Carnival HEV : న్యూ జెనరేషన్​ కార్నివాల్​ని .. కియా మోటార్స్​ గతేడాది లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఈ కియా కార్నివాల్​లో హైబ్రీడ్​ మోడల్​ని ఆవిష్కరించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని పేరు కార్నివాల్​ హెచ్​ఈవీ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 కియా కార్నివాల్​ హైబ్రీడ్​..

ఈ 2025 కియా కార్నివాల్​ హైబ్రీడ్​లో 4 వేరియంట్లు ఉంటాయి. అవి.. ఎల్​ఎక్స్​ఎస్​, ఈఎక్స్​, ఎస్​ఎక్స్​, ఎస్​ఎక్స్​ ప్రెస్టీజ్​. ఈ మోడల్​ సేల్స్​.. ఈ ఏడాది రెండో భాగంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరి ఈ కియా కార్నివాల్​ హెచ్​ఈవీ.. ఇండియాలో అడుగుపెడుతుందా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ న్యూ జెనరేషన్​ కియా కార్నివాల్​ మాత్రం.. ఈ ఏడాది ఇండియాలో కచ్చితంగా లాంచ్​ అవుతుంది.

2025 కియా కార్నివాల్​ హైబ్రీడ్​లో 1.6 లీటర్​ టర్బో హైబ్రీడ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్​ మోటార్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్​ మోటార్​ ఒక్కటే.. 72 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. మొత్తం మీద.. ఈ ఇంజిన్​ సెటప్​.. 242 హెచ్​పీ పవర్​ని, 367 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఎలక్ట్రిక్​ మోటార్​ ఉన్నందున.. టార్క్​ అనేది వెంటనే కిక్​ అవుతుంది. టర్బోఛార్జర్​ యాక్టివేట్​ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిన అవసరం. ఇక ఈ వెహికిల్​లో 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

2025 Kia Carnival Hybrid price : హైబ్రీడ్​ ఇంజిన్​తో పర్ఫార్మెన్స్​తో పాటు ఎఫీషియెన్సీ కూడా పెరుతుందని సంస్థ చెబుతోంది. ఎయిర్​ఫ్లో కోసం 17 ఇంచ్​ వీల్స్​ని ప్రత్యేకించి రూపొందించినట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. పాడిల్​ షిఫ్టర్స్​ని వాడి.. డ్రైవరే.. రీజెనరేటివ్​ బ్రేకింగ్​ని అడ్జెస్ట్​ చేయవచ్చని తెలిపింది. ఈ రీజెనరేటివ్​ బ్రేకింగ్​లో మొత్తం 3 లెవల్స్​ ఉంటాయని, వాటిల్లో నుంచి ఒకదానిని డ్రైవర్​ పిక్​ చేసుకోవచ్చని పేర్కొంది.

ఈ కియా కార్నివాల్​ హెచ్​ఈవీ హైబ్రీడ్​ మోడల్​లో కార్నర్స్​లో వెహికిల్​ రెస్పాన్స్​ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ఈ- హ్యాండ్లింగ్​ టెక్నాలజీ ఉంటుంది. ఈ రైడ్​ ఫీచర్​తో.. బంప్స్​ ఉండే రోడ్లపై ప్రయాణం సాఫీగా ఉంటుంది. ఇక ఈ- ఎహిసివ్​ హ్యాండ్లింగ్​ అసిస్ట్​తో.. ఎమర్జెన్సీ స్టీరింగ్​ సమయంలో వెహికిల్​ మూమెంట్​ని కంట్రోల్​ చేయడానికి వీలవుతుంది.

2025 Kia Carnival release date : అంతేకాకుండా.. 2025 కార్నివాల్​ని అడాస్​ ఫీచర్స్​ని అప్డేట్​ చేసింది కియా మోటార్స్​. జంక్షన్​ క్రాసింగ్​, లార్జ్​ ఛేండ్​ ఆన్​కింగ్​, ఎవిసివ్​ స్టీరింగ్​ అసిస్ట్​, నేవిగేషన్​ ఆధారిత స్మార్ట్​ క్రూజ్​ కంట్రోల్​, ఇంటెలిజెంట్​ స్పీడ్​ లిమిట్​ అసిస్ట్​ వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ 2025 కియా కార్నివాల్​ హెచ్​ఈవీ (హైబ్రీడ్​) మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇండియాలో లాంచ్​ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం