తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Rumion Mpv : టయోటా రుమియన్​ ఎంపీవీ లాంచ్​.. ధర ఎంతంటే..!

Toyota Rumion MPV : టయోటా రుమియన్​ ఎంపీవీ లాంచ్​.. ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu

28 August 2023, 15:25 IST

    • Toyota Rumion MPV : టయోటా రుమియన్​ ఎంపీవీ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ వెహికిల్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టయోటా రుమియన్​ ఎంపీవీ లాంచ్​.. ధర ఎంతంటే..!
టయోటా రుమియన్​ ఎంపీవీ లాంచ్​.. ధర ఎంతంటే..!

టయోటా రుమియన్​ ఎంపీవీ లాంచ్​.. ధర ఎంతంటే..!

Toyota Rumion MPV launched : టయోటా రుమియన్​ ఎంపీవీ.. అధికారికంగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ వెహికిల్​ను టయోటా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మోడల్​ బుకింగ్స్​ తాజాగా ఓపెన్​ అయ్యాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో ఈ వెహికిల్​ను బుక్​ చేసుకోవచ్చు. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎంపీవీ హైలైట్స్​ ఇవే..

ఎంపీవీ సెగ్మెంట్​లో.. టయోటా ఇన్నోవా బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఇక మారుతీ సుజుకీ ఎర్టిగాకు కూడా మంచి డిమాండ్​ లభిస్తోంది. ఇక.. రెండు సంస్థల మధ్య ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యం నేపథ్యంలో రుమియన్​ను తీసుకొచ్చింది టయోటా. అయితే ఇది కొత్తేమీ కాదు. మారుతీ సుజుకీ బలెనోను గ్లాంజాగా, గ్రాండ్​ విటారాను అర్బన్​ క్రూజ్​ హైరైడర్​గా ఇండియాలో లాంచ్​ చేసింది. వీటిని తయారు చేసిన ప్లాట్​ఫామ్​ ఒకటే. కాకాపోతే కొన్ని ఫీచర్స్​, ఇంజిన్​లో కాస్త మార్పులు కనిపిస్తాయి.

ఎంపీవీ సెగ్మెంట్​లో ఇన్నోవాతో పాటు మరో వెహికిల్​తో సేల్స్​ను పెంచుకోవాలని జపాన్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా భావించింది. అందుకే ఈ రుమియన్​ను లాంచ్​ చేసింది. ఇక ఈ 7 సీటర్​ వెహికిల్​లో 1.5 లీటర్​ కే సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. దీని మైలేజ్​ 20.51 కేఎంపీహఎల్​. ఈ ఇంజిన్​. 101 బీహెచ్​పీ పవర్​ను, 136.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ మోడల్​లో సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది. దీని మైలేజ్​ 26.11 కేఎం/కేజీ.

టయోటా రుమియన్​ వేరియంట్లు- వాటి ధరలు (ఎక్స్​షోరూం)..

Toyota Rumion MPV price in India : రుమియన్​లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి.

ఎస్​ ఎంటీ (పెట్రోల్​)- రూ. 10.29లక్షలు

ఎస్​ ఏటీ (పెట్రోల్​)- రూ. 11.89లక్షలు

జీ ఎంటీ (పెట్రోల్​)- రూ. 11.45లక్షలు

వీ ఎంటీ (పెట్రోల్​)- రూ. 12.18లక్షలు

వీ ఏటీ (పెట్రోల్​)- రూ. 13.68లక్షలు

ఎస్​ ఎంటీ (సీఎన్​జీ)- రూ. 11.24లక్షలు

హైదరాబాద్​లో టయోటా రుమియన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

Toyota Rumion MPV bookings : మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించిన ఈ టయోటా రుమియన్​ ఎంపీవీ.. కియా క్యారెన్స్​కు గట్టిపోటీనిస్తుంది. సెప్టెంబర్​ 8 నుంచి ఈ మోడల్​ డెలివరీలు మొదలవుతాయని సంస్థ చెప్పింది.

తదుపరి వ్యాసం