Penny Stock : మీరు స్టాక్ మార్కెట్‌కు కొత్తవారా? ఈ పెన్నీ స్టాక్స్‌తో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి
27 August 2024, 18:30 IST
- Stock Market : స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చినవారు కొన్నిసార్లు అధికంగా డబ్బులు పొగొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటివారు ముందుగా పెన్నీ స్టాక్స్‌తో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మార్కెట్‌లు ఎలా వెళ్తున్నాయో ఒక అంచనాకు రాగలరు.
పెన్నీ స్టాక్స్
స్టాక్ మార్కెట్‌కు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది వస్తున్నారు. ట్రేడింగ్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. కానీ ఆవేశంతో అధిక ధర ఉన్న స్టాక్ మీద డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో కొత్తగా వచ్చిన వారు ముందుగా చిన్న స్టాక్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. స్టాక్ సూచీల అస్థిరత లేదా స్టాక్ కదలికను ఎలా అర్థం చేసుకోవాలో చాలా మందికి స్పష్టమైన అవగాహన లేదు. మొదటిసారిగా వచ్చిన ఇన్వెస్టర్లు తక్కువ ధర అంటే పెన్నీ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
ఇందుకోసం అత్యుత్తమ పెన్నీ స్టాక్‌లను కనుగొనాలి. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ డబ్బుతోనే స్టాక్ మార్కెట్ కదలికలను గమనించాలి. నేరుగా పెద్ద స్టాక్స్ మీద పెట్టి డబ్బులు సంపాదిస్తామంటే కుదరదు. డబ్బు పోతుంది. రూ.10 కంటే తక్కువ ఉండి మంచి ప్రదర్శన ఉన్న మూడు స్టాక్స్ గురించి చూద్దాం..
భండారీ హొసియరీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ వస్త్రాల తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.182 కోట్లు. ఎన్‌ఎస్‌ఈలో షేరు ధర రూ.7.63. గత ఐదు రోజుల్లో ఈ షేరు 8.84 శాతం లాభపడగలిగింది. ఒక నెల వ్యవధిలో స్టాక్ 2.69 శాతం అడ్వాన్స్‌గా లాభపడింది. భండారీ హోసియరీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ స్టాక్ కూడా 2024లో ఇప్పటివరకు 31.10 శాతం లాభాన్ని చూసింది. 11.32 52 వారాల గరిష్ట స్టాక్ ధర.
యూనిటెక్ లిమిటెడ్ యునిటెక్ లిమిటెడ్ అనేది న్యూదిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి సంస్థ. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,540 కోట్లు. షేర్ ధర ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుత షేరు ధర రూ.9.65. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 1 శాతం లాభపడింది. 2024లో ఇప్పటివరకు ఈ స్టాక్ 37.86 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది కాలంలో 451.43 శాతం లాభంతో మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో ఈ స్టాక్ కూడా చేరింది. 52 వారాల గరిష్టం రూ.18.50గా ఉంది.
అంటార్కిటికా లిమిటెడ్ ప్రింటింగ్ వ్యాపారంలో ఉంది. పేపర్ ఆధారిత ప్యాకేజింగ్ అండ్ పబ్లిషింగ్ ప్రొడక్ట్ తయారీదారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30.1 కోట్లు. ఎన్ఎస్ఈలో ప్రస్తుత షేరు ధర రూ.1.94. గత ఐదు రోజుల్లో 19.75 శాతం, ఒక నెలలో 4.30 శాతం లాభపడింది. 2024లో ఇప్పటివరకు 29.33 శాతం షేర్ లాభపడింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 104.21 శాతం లాభాన్ని చూసింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. పెద్ద స్టాక్స్ కొంటె ఎక్కువగా నష్టపోతారు కాబట్టి.. పెన్నీ స్టాక్స్ మీద ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పడం మా ఉద్దేశం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.