తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Solar Power Bank : సోలార్ పవర్ బ్యాంక్.. ఇక ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేదు

Solar Power Bank : సోలార్ పవర్ బ్యాంక్.. ఇక ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేదు

Anand Sai HT Telugu

21 October 2024, 18:30 IST

google News
  • Solar Power Bank : ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడం అనే బాధ అందరికీ ఉంటుంది. అందుకే చాలా మంది పవర్ బ్యాంకులు మెయింటెన్ చేస్తారు. దానికి కూడా కరెంట్ కావాలి. ఇక మీరు సోలార్ పవర్ బ్యాంకునూ వాడొచ్చు. దాని ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం..

సోలార్ పవర్ బ్యాంక్
సోలార్ పవర్ బ్యాంక్

సోలార్ పవర్ బ్యాంక్

ఫోన్ ఛార్జింగ్ గురించి దాదాపు అందరూ ఫిర్యాదు చేస్తారు. వెంట పవర్ బ్యాంకులు తీసుకెళ్తారు. అయితే దానికి కూడా కరెంట్ తప్పనిసరి. అదే సోలార్ పవర్ బ్యాంక్ ఉంటే ఈ సమస్యలు ఉండవు. కాసేపు ఎండలో పెడితే అదే ఛార్జింగ్ అయిపోతుంది. తర్వాత ఫోన్‌కు ఛార్జ్ పెట్టొచ్చు. తాజాగా ఆంబ్రేన్ కంపెనీ సోలార్ పవర్ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం..

ఆంబ్రేన్ తన పవర్‌ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలోకి కొత్తదాన్ని తీసుకొచ్చింది. ఇది 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటే ఇది సూర్యరశ్మి ద్వారా ఛార్జ్ అవుతుంది. దీనికి సోలార్ 10కె పవర్ బ్యాంక్ అని పేరు పెట్టారు. నాలుగు ఫోల్డ్ సోలార్ ప్యానెల్స్ కలిగి ఉన్నందున ఈ పరికరం డిజైన్ చాలా ప్రత్యేకమైనది. ఈ ట్రావెల్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్ 22.5వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్ పుట్‌ను సపోర్ట్ చేస్తుంది.

సోలార్ 10కె పవర్ బ్యాంక్ ధర అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆంబ్రేన్ ఇండియా వెబ్‌సైట్లలో రూ.2799కు అందుబాటులో ఉంది. 180 రోజుల వారంటీతో లభిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి సోలార్ 10కె పవర్ బ్యాంక్‌ను 5 రోజుల వరకు (సూర్యరశ్మి పరిస్థితులను బట్టి) పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. వేగవంతమైన ఛార్జ్ కోసం, దీనిని 20 వాట్ పిడి ఛార్జర్‌తో కూడా జత చేయవచ్చు. ఇది కేవలం 3.5 గంటల్లో పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేయగలదు. సేఫ్టీ కోసం మంచి చిప్‌సెట్‌ను కలిగి ఉంది. వేడెక్కడం, అధిక ఛార్జింగ్, ఇతర ప్రమాదాల నుండి రక్షిస్తుంది.

పవర్ బ్యాంక్ ఫోల్డబుల్ సోలార్ ప్యానెల్స్ దీనిని కాంపాక్ట్, పోర్టబుల్‌గా చేస్తాయి. ఈ పవర్ బ్యాంక్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇతర యూఎస్బీ టైప్-సి లేదా యుఎస్బీ-ఎ పరికరాలను 22.5 వాట్ల గరిష్ట అవుట్‌పుట్‌తో 2-3 సార్లు ఛార్జ్ చేయగలదు. యూఎస్బీ-ఏ, టైప్-సీ కనెక్షన్లతో దీన్ని కనెక్ట్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం