తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023: అన్ని ఫేమస్ బ్రాండ్స్ స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్స్..

Amazon Sale 2023: అన్ని ఫేమస్ బ్రాండ్స్ స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్స్..

HT Telugu Desk HT Telugu

13 October 2023, 16:32 IST

  • Amazon Sale 2023: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అన్ని ఫేమస్ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. బీట్ ఎక్స్ పీ, నాయిస్ ఫిట్ వంటి కంపెనీల స్మార్ట్ వాచెస్ మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు లభిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

ప్రతీకాత్మక చిత్రం

Amazon Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ ఈ సంవత్సరం అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రారంభించింది. ఈ సేల్ అక్టోబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. ఈ సేల్ లో ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, గ్రోసరీ, ఫ్యాషన్ కేటగిరీల వస్తువులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.

స్మార్ట్ వాచ్ లపై..

సంప్రదాయ అనలాగ్ వాచ్ ల స్థానంలో ఇప్పుడు స్మార్ట్ వాచ్ (smartwatch) ల వినియోగం పెరిగింది. వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా, చాలా ప్రయోజనాలు ఉండడంతో అంతా వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) లో వీటిపై ఆమెజాన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ను ప్రకటించింది.

beatXP: బీట్ ఎక్స్ పీ రేజ్

బీట్ ఎక్స్ పీ రేజ్ స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 87% డిస్కౌంట్ ఉంది. దీని ఒరిజినల్ ధర రూ. 7499 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 999 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో రూ. 5 వేల పైబడిన కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 1.96 ఇంచ్ ల డిస్ ప్లే, అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్ ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్పీఓ2, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్స్, వివిధ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి.

Fire-Boltt Phoenix Pro : ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రొ

ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రొ స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 91% డిస్కౌంట్ ఉంది. దీని ఒరిజినల్ ధర రూ. 11999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 1099 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో రూ. 5 వేల పైబడిన కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 1.39 ఇంచ్ ల డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్పీఓ2, హార్ట్ రేట్ వంటి హెల్త్ ఫీచర్స్, 120 స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. ధృడమైన మెటల్ బాడీతో ఆకర్షణీయంగా ఉంటుంది.

NoiseFit Halo: నాయిస్ ఫిట్ హాలో

నాయిస్ ఫిట్ హాలో స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 69% డిస్కౌంట్ ఉంది. దీని ఒరిజినల్ ధర రూ. 7999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 2499 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో రూ. 5 వేల పైబడిన కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 1.43 ఇంచ్ ల అమొలెడ్ డిస్ ప్లే, రౌండ్ డయల్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్పీఓ2, హార్ట్ రేట్ వంటి హెల్త్ ఫీచర్స్, 100 స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. ధృడమైన మెటాలిక్ బాడీతో ఆకర్షణీయంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం