తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival : ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!

Amazon Great Indian Festival : ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!

Sharath Chitturi HT Telugu

10 October 2023, 13:17 IST

  • Amazon Great Indian Festival sale : అమెజాన్​లో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై మరింత డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!
బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..! (Amazon)

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!

Amazon Great Indian Festival 2023 : ఇండియాలో ఏం నడుస్తోంది? అని అంటే.. 'అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివేల్​ సేల్​ నడుస్తోంది..' అన్న సమధానాలు వినిపిస్తున్నాయి. అమెజాన్​ ఇస్తున్న ఆఫర్లు.. అ రేంజ్​లో ఉన్నాయి మరి! ఈ నేపథ్యంలో పలు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​లపై మరింత క్రేజీ డీల్స్​ లభిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

ఈ స్మార్ట్​వాచ్​లపై మంచి తగ్గింపు..

బీట్​ ఎక్స్​పీ ఫ్లేర్​ ప్రో:- ఈ వాచ్​ వాస్తవ ధర రూ. 5499. కాగా.. ఇప్పుడు కేవలం రూ. 999కే దక్కించుకోవచ్చు. రూ. 5వేలు విలువ చేసే ఎస్​బీఐ డెబిట్​ కార్డ్​ నాన్​-ఈఎంఐ ట్రాన్సాక్షన్​పై 10శాతం ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ కూడా పొందొచ్చు.

ఈ స్మార్ట్​వాచ్​లో 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 1.39 ఇంచ్​ అల్ట్రా హెచ్​డీ రౌండ్​ డిస్​ప్లే ఉంటుంది. 100కుపైగా స్పోర్ట్స్​ మోడ్స్​ దీని సొంతం. ఫీమేల్​ హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​, హార్ట్​ రేట్​ మానిటరింగ్​, ఎస్​పీఓ2 ట్రాకింగ్​ వంటివి కూడా ఉన్నాయి.

Best deals on Smart watches in Amazon : నాయిస్​ పల్స్​ 2 మ్యాక్స్​:- ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 5,999. అమెజాన్​లో రూ. 1199కే కొనుగోలు చేసుకోవచ్చు. రూ. 5వేలు విలువ చేసే ఎస్​బీఐ డెబిట్​ కార్డ్​ నాన్​-ఈఎంఐ ట్రాన్సాక్షన్​పై 10శాతం (రూ. 750 వరకు) ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ కూడా పొందొచ్చు.

ఇందులో 1.85 ఇంచ్​ డిస్​ప్లే, 150 వాచ్​ ఫేసెస్​, 100 స్పోర్ట్స్​ మోడ్స్​ వంటివి వస్తున్నాయి. అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ దఫా అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో రూమ్​ హీటర్స్​పైనా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

బోట్​ వేవ్​ ఎడ్జ్​:- దీని వాస్తవ ధర రూ. 8,9990. ఇది అమెజాన్​లో ఏకంగా 86శాతం డిస్కౌంట్​తో కేవలం రూ. 1,199కే లభిస్తోంది. రూ. 5వేలు విలువ చేసే ఎస్​బీఐ డెబిట్​ కార్డ్​ నాన్​-ఈఎంఐ ట్రాన్సాక్షన్​పై 10శాతం ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ (రూ. 750 వరకు) కూడా పొందొచ్చు.

Amazon sale 2023 : ఈ వాచ్​లో 1.85 ఇంచ్​ డిస్​ప్లే, ఏఐ వాయిస్​ అసిస్టెంట్​, 100 స్పోర్ట్స్​ మోడ్స్​, ఇన్​బిల్ట్​ గేమ్స్​ వంటి వాటితో పాటు అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కూడా వస్తున్నాయి.

ఫైర్​-బోల్ట్​ ఫీనిక్స్​:- దీని వాస్తవ ధర రూ. 2199. కానీ అమెజాన్​ సేల్​లో దీనిని 40శాతం ఆఫర్​ల రూ. 1299కే కొనుగోలు చేసుకోవచ్చు. రూ. 5వేలు విలువ చేసే ఎస్​బీఐ డెబిట్​ కార్డ్​ నాన్​-ఈఎంఐ ట్రాన్సాక్షన్​పై 10శాతం (రూ. 750 వరకు) ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ కూడా పొందొచ్చు.

ఇందులో 1.3 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్ట్రామ్​ వంటి యాప్స్​ను సపోర్ట్​ చేస్తుంది. 100కుపైగా స్పోర్ట్స్​ మోడ్స్​, అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ దీని సొంతం.

తదుపరి వ్యాసం