తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​పై అదిరిపోయే డిస్కౌంట్​!

Amazon Great Indian Festival : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​పై అదిరిపోయే డిస్కౌంట్​!

Sharath Chitturi HT Telugu

09 October 2023, 14:42 IST

  • Amazon Great Indian Festival : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 4పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

సామ్​సంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​పై అదిరిపోయే డిస్కౌంట్​!
సామ్​సంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​పై అదిరిపోయే డిస్కౌంట్​!

సామ్​సంగ్​ గెలాక్సీ స్మార్ట్​వాచ్​పై అదిరిపోయే డిస్కౌంట్​!

Amazon Great Indian Festival : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో అనేక ప్రాడక్ట్స్​పై క్రేజీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇక ఈ జాబితాలో సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 4 కూడా ఉంది. వీటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

అమెజాన్​ సేల్​లో భారీ ఆఫర్​..

2021లో రూ. 23,999 ధరకు ఈ గెలాక్సీ వాచ్​ 4ని లాంచ్​ చేసింది సామ్​సంగ్​ సంస్థ. ఇక ఇప్పుడు.. ఇది అమెజాన్​లో రూ. 9,999కే లభిస్తోంది. ఎస్​బీఐ కార్డ్​ ఉంటే.. ఈ వాచ్​ని రూ. 7,991కే కొనుగోలు చేసుకోవచ్చు! ఆఫర్​ అదిరింది కదా!

Samsung Galaxy watch 4 price : ఈ సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 4లో 1.2 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. దీనికి 396x396 రిసొల్యూషన్​ వస్తుంది. 1.18జీహెచ్​జెడ్​ డ్యూయెల్​ కోర్​ ప్రాసెసర్​ దీని సొంతం. 1.5జీబీ ర్యామ్​- 16జీబీ స్టోరేజ్​ వస్తోంది. ఈ 16జీబీలో కస్టమర్లకు 7.6జీబీ లభిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

స్మార్ట్​వాచ్​లో 247ఎంఏహెచ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఆల్​వేస్​ ఆన్​ డిస్​ప్లేని టర్న్​ ఆఫ్​ చేస్తే. 40 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ గ్యాడ్జెట్​ బరువు 25.9 గ్రాములు. చాలా లైట్​గా ఉంటుంది.

Samsung Galaxy watch 4 price in Amazon : యాక్సెలరోమీటర్​, బారోమీటర్​, గైరో సెన్సార్​, జియోమాగ్నెటిక్​ సెన్సార్​, లైట్​ సెన్సార్​, ఆప్టికల్​ హార్ట్​ రేట్​ సెన్సార్​, ఎలక్ట్రికల్​ హార్ట్​ సెన్సార్​, బయోఎలక్ట్రికల్​ ఇంపెన్​డెన్స్​ ఎనాలసిస్​ సెన్సార్​ వంటి హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ ఈ వాచ్​ సొంతం.

సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 4లో వాచ్​ ఓఎస్​ సాఫ్ట్​వేర్​ ఉంటుంది. బ్లూటూత్​ వీ5.0, ఎన్​ఎఫ్​సీ, వై-ఫై (2.4+5జీహెచ్​జెడ్​), జీపీఎస్​, గ్లోనాస్​, బైడూ, గెలీలియ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

యాపిల్​ ఎయిర్​పాడ్స్​పై క్రేజీ ఆఫర్​..!

యాపిల్​ వెబ్​సైట్​లో ఎయిర్​పాడ్స్​ ప్రో 2 ధర రూ. 24,900గా ఉంది. కాగా.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో మాత్రం ఈ గ్యాడ్జెట్​ను ఆఫర్​లో రూ. 18,499కే కొనుగోలు చేసుకోవచ్చు. పలు బ్యాంక్​ల కార్డులపై ఇంకొన్ని ఆఫర్స్​ కూడా వస్తున్నాయి. ఫలితంగా.. ఫ్లిప్​కార్ట్​లో ఈ మోడల్​ రూ. 16,999కి.. అమెజాన్​లో రూ. 16,749కే పొందొచ్చు. ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​, ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​లో యూఎస్​బీ-టైప్​ సీ కనెక్టర్​ వస్తున్న విషయం తెలిసిందే. ఇక యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రోని కూడా దానితోనే ఛార్జ్​ చేసుకోవచ్చు. ఈ డివైజ్​లో ఐపీ54 రేటింగ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం