Samsung Galaxy S24 : శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?-check all the samsung galaxy s24 series leaked information so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S24 : శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Samsung Galaxy S24 : శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Aug 12, 2023 01:35 PM IST

Samsung Galaxy S24 : శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 కు సంబంధించి కొన్ని ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?
శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 ఫీచర్స్​ లీక్​.. లాంచ్​ ఎప్పుడు?

Samsung Galaxy S24 : గెలాక్సీ ఎస్​24 సిరీస్​పై దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ శామ్​సంగ్​ ఫోకస్​ చేసింది. ఈ మోడల్​.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్​ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ సిరీస్​కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. అవి చాలా ఎగ్జైటింగ్​గా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..

ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో ఫీచర్స్​ ఏముంటాయి..?

శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 సిరీస్​లో స్టాండర్డ్​, ప్లస్​, అల్ట్రా వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న గెలాక్సీ ఎస్​23 మోడల్స్​కు సక్సెసర్​గా ఉంటాయని సమాచారం. గెలాక్సీ ఎస్​23, ఎస్​23 ప్లస్​లో 8జీబీ ర్యామ్​ వస్తోంది. ఇక ఎస్​23 అల్ట్రాలో 12జీబీ ర్యామ్​ ఉంటుంది.

Samsung Galaxy S24 ultra price : ఇక నెక్స్ట్​ జనరేషన్​ శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24, ఎస్​24 ప్లస్​లో బంప్​డ్​ అప్​ ర్యామ్​, స్టోరేజ్​ కెపాసిటీలు ఉంటాయని సమాచారం. అంటే వీటిల్లో 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ ఉండొచ్చు. ఇవి 3 మోడల్స్​కు స్టాండర్డ్​గా రావొచ్చు.

లీక్​ అయిన డేటా ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో శామ్​సంగ్​కు చెందిన లేటెస్ట్​ డిస్​ప్లే టెక్నాలజీ ఉంటుంది. ఈ మూడు వేరియంట్లలో ఎం13 సిరీస్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే లభిస్తుంది. ఎం12తో పోల్చుకుంటే ఇది లైట్​గా ఉండటంతో పాటు పవర్​ ఎఫీషియెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. రానున్న ఐఫోన్​ 15లో కూడా ఎం12 ఉంటుందని తెలుస్తోంది. అంటే.. శామ్​సంగ్​ యూజర్స్​కు గెలాక్సీ ఎస్​24తో లేటెస్ట్​ టెక్నాలజీ లభించనుంది!

శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34..

Samsung Galaxy F34 price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34 ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఇందులో 6.46 ఇంచ్​ 120 హెచ్​జెడ్​తో కూడిన అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. సెంటర్​ అలైన్డ్​ వాటర్​డ్రాప్​ నాచ్..​ టాప్​లో ఉంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​ లెన్స్, 2ఎంపీ మాక్రో కెమెరాలు​ రేర్​లో వస్తున్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ శామ్​సంగ్​ గెలాగ్సీ ఎఫ్​34 5జీలో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

ఈ స్మార్ట్​ఫోన్​కు కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్​ వస్తోంది. ఆక్టా కోర్​ ఎక్సినోస్​ 1289 ఎస్​ఓసీ చిప్​సెట్​ దీని సొంతం. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరింట్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత వన్​ యూఐ 5.1 సాఫ్ట్​వేర్​తో ఇది పనిచేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం