Samsung Galaxy Tab A9 : ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 లాంచ్​.. ధర ఎంతంటే!-samsung galaxy tab a9 galaxy tab a9 launched in india check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy Tab A9 : ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 లాంచ్​.. ధర ఎంతంటే!

Samsung Galaxy Tab A9 : ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 10:06 AM IST

Samsung Galaxy Tab A9 : సామ్​సంగ్​ నుంచి రెండు కొత్త ట్యాబ్లెట్స్​ లాంచ్​ అయ్యాయి. వాటి పేర్లు, ఫీచర్స్​, ధరలు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 లాంచ్​..
ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 లాంచ్​..

Samsung Galaxy Tab A9 : గెలాక్సీ ట్యాబ్​ ఏ9 సిరీస్​ని ఇటీవలే ఇండియాలో ఆవిష్కరించింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ సామ్​సంగ్​. ఇక ఇప్పుడు ఈ సిరీస్​.. దేశంలో అధికారికంగా లాంచ్​ అయ్యింది. ఈ సిరీస్​లో.. గెలాక్సీ ట్యాబ్​ ఏ9, గెలాక్సీ ట్యాబ్​ ఏ9+ మోడల్స్​ ఉన్నాయి. ఈ రెండూ కూడా తాజాగా అమెజాన్​లో లిస్ట్​ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​కు సంబంధించిన ఫీచర్స్​, ధరలు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సామ్​సంగ్​ కొత్త ట్యాబ్​ విశేషాలు..

సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9లో.. 60 హెచ్​జెడ్​తో కూడిన 8.7 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంటుంది. హీలియో జీ99 చిప్​సెట్​ దీని సొంతం. 5,100 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 15వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది. 8 ఎంపీ రేర్​ కెమెరా, 2 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు వస్తున్నాయి. దీని బరువు 366 గ్రాములు, థిక్​నెస్​ 8ఎంఎం.

Samsung Galaxy Tab A9 plus review : ఇక గెలాక్సీ ట్యాబ్​ ఏ9+ లో 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ దీని సొంతం. 7,040 బ్యాటరీతో పాటు 15వాట్​ ఛార్జింగ్​ లభిస్తుంది. 5ఎంపీ ఫ్రెంట్​ కెమెర, 8ఎంపీ రేర్​ కెమెరాలు వస్తున్నాయి. ఈ మోడల్​ థిక్​నెస్​ 6.9ఎంఎం, బరువు 510 గ్రాములు.

ఈ రెండు గ్యాడ్జెట్స్​కి కూడా సిమ్​, వైఫై-5, బ్లూటూత్​ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. ఈ రెండు కూడా ఆండ్రాయిడ్​ 13 ఆధారిత 1 యూఐ సాఫ్ట్​వేర్​పై పనిచేస్తాయి.

వీటి ధరలు ఎంతంటే..!

Samsung Galaxy Tab A9 plus price : సామ్​సంగ్​ గెలాక్సీ ట్యాబ్​ ఏ9 4జీబీ ర్యామ్​- 64జీబీ (వైఫ్​ ఓన్లీ) స్టోరేజ్ వేరియంట్​​ ధర రూ. 12,999. ఇక 4జీబీ ర్యామ్​- 64 జీబీ స్టోరేజ్​ (వైఫై + 4జీ) వేరియంట్​ ధర రూ. 15,999గా ఉంది.

మరోవైపు గెలాక్సీ ట్యాబ్​ ఏ9+ లో 4జీబీ ర్యామ్​- 64జీబీ స్టోరేజ్​ (వైఫై ఓన్లీ), 8 జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ (వైఫై+ 5జీ), 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ (వైఫై ఓన్లీ) వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరకు సంబంధించి ప్రస్తుతం క్లారిటీ లేదు. కాకపోతే.. మూడో వేరియంట్​ ధర రూ. 20,999గా ఉంది.

Samsung Galaxy Tab A9 price : ఇక ఈ సామ్​సంగ్​ కొత్త ట్యాబ్స్​.. డార్క్​ బ్లూ, గ్రే, సిల్వర్​ కలర్స్​లో అందుబాటులో ఉంటాయి. వీటికి ఛార్జర్​ రావడం లేదు. ఎస్​బీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై ఆఫర్స్​ కూడా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం