తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mobile Addiction: స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయ్యారా?.. ఈ యాప్ తో ఆ వ్యసనం నుంచి బయటపడండి..

Mobile addiction: స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయ్యారా?.. ఈ యాప్ తో ఆ వ్యసనం నుంచి బయటపడండి..

HT Telugu Desk HT Telugu

27 December 2023, 15:31 IST

google News
  • Forest app boosts productivity: ఇప్పుడు దాదాపు అందరూ మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడ్డారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నారు. దాంతో, చదువు, వృత్తి, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉత్పాదకత తగ్గిపోతోంది. ఫారెస్ట్ యాప్ సహాయంతో మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Forest app)

ప్రతీకాత్మక చిత్రం

Forest app boosts productivity: నేటి టెక్-ఆధిపత్య ప్రపంచంలో, మనం పని చేయడానికి, చదువుకోవడానికి లేదా మౌనంగా కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు తరచుగా మన ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించే అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది స్మార్ట్ ఫోన్.

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ లక్షణాలు..

స్మార్ట్ ఫోన్ అడిక్షన్ (smart phone addiction) లక్షణాలు చాలా ఉంటాయి. అవసరం లేకపోయినా, ఫోన్ ను చేతిలోకి తీసుకోవడం, అవసరం లేకపోయినా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను స్క్రోల్ చేస్తూ ఉండడం, ప్రతి 5 నిమిషాలకు నోటిఫికేషన్‌లను తనిఖీ చేస్తుండడం, యూట్యూబ్ చానెల్స్ ను కంటిన్యుయస్ చూస్తూ ఉండడం మొదలైనవి వాటిలో కొన్ని. ఈ వ్యసనం ముదురుతున్న కొలదీ స్మార్ట్ ఫోన్ పై గడిపే సమయం ఎక్కువ అవుతుంటుంది. రాత్రి నిద్ర మేలుకుని మరీ స్మార్ట్ ఫోన్ ను చూస్తూ ఉంటారు. పిల్లలు, టీనేజ్ వాళ్లు, యువత వీడియో గేమ్స్ కు, ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అయిపోయి సమయంతో పాటు డబ్బును కూడా వృధా చేస్తుంటారు. మానసికంగా కూడా దుర్భలులు అవుతుంటారు. అలా, స్మార్ట్ ఫోన్ ధ్యాసలో పడిపోయి ఆఫీసు పని లేదా చదువుల వంటి ముఖ్యమైన ఇతర విధులను నిర్లక్ష్యం చేస్తుంటారు.

వ్యసనం నుంచి బయటపడడం ఎలా?

ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం (smart phone addiction) నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఈ వ్యసనం నుంచి బయటపడాలన్న కోరిక బలంగా ఉంటే, మీకు ఫారెస్ట్ యాప్‌ (Forest app) ఉపయోగపడుతుంది. ఈ యాప్ సహాయంతో పనిపై, మన లక్ష్యాలపై, ఉత్పాదకతపై కాన్సంట్రేషన్ పెంచుకోవచ్చు.

ఫారెస్ట్ యాప్ అంటే ఏమిటి?

ఫారెస్ట్ యాప్ అనేది వినియోగదారులను "ఏకాగ్రతతో ఉండండి, వర్తమానంలో ఉండండి (stay focused, be present)" అని ప్రోత్సహించే యాప్. ఈ యాప్ స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని తగ్గిస్తుంది. చదువు, పని, ఇతర లక్ష్యాలపై దృష్టి మరల్చకుండా చూస్తుంది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత అందులో ఫోకస్ అవర్స్ కోసం టైమర్‌ను సెట్ చేసుకోవాలి. టైమర్ సెట్ చేసుకోగానే, ఒక వర్చువల్ ట్రీ (virtual tree) ని నాటుతారు. స్మార్ట్‌ఫోన్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే, ఆ చెట్టు అంత త్వరగా పెరుగుతుంది. ఒకవేళ, ఫోకస్ యాప్ నియమాలను ఉల్లంఘిస్తే వర్చువల్ ట్రీ తక్షణమే చనిపోతుంది. వర్చువల్ చెట్లను పెంచడం వల్ల వినియోగదారులు తమ ఫోన్‌లకు దూరంగా గడిపినందుకు బహుమతిగా నాణేలను సంపాదించగలుగుతారు.

కుటుంబ సభ్యులతో కూడా..

ఈ యాప్ ను కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గ్రూప్ టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వినియోగదారులు ఒకరినొకరు సవాలు చేసుకోవచ్చు. నిర్ణీత సమయాలలో వారి చాలా పనులను పూర్తి చేసుకోవచ్చు. ఈ యాప్ (Forest app) వినియోగదారులకు వారి పురోగతిని, పెరిగిన చెట్లతో మొత్తం అడవిని సృష్టించడం ద్వారా వారు ఎన్ని గంటలు ఫోకస్ మోడ్‌లో ఉన్నారు అనే సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఈ కాన్సెప్ట్ వినియోగదారులను చైతన్యవంతం చేస్తుంది, అలాగే, దృష్టి కేంద్రీకరించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. ఫారెస్ట్ యాప్ ప్రతి కొన్ని నిమిషాలకు మీ స్మార్ట్‌ఫోన్ ను చెక్ చేయాలనే కోరికను తగ్గిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత మరియు ఉత్పాదకత పెరుగుతుంది. ఈ ఉచిత వర్షన్ తో పాటు చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ వెర్షన్‌తో వస్తుంది.

తదుపరి వ్యాసం