తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar-pan Linking Deadline: ఆధార్ - పాన్ లింక్ చేశారా? జూన్ 30 వరకే ఆ ఛాన్స్

Aadhaar-PAN linking deadline: ఆధార్ - పాన్ లింక్ చేశారా? జూన్ 30 వరకే ఆ ఛాన్స్

HT Telugu Desk HT Telugu

14 June 2023, 13:17 IST

google News
  • Aadhaar-PAN linking: ఆధార్ నెంబర్ ను పాన్ తో అనుసంధానం చేయడానికి గడువు జూన్ 30వ తేదీ వరకే ఉంది. ఆ లోపు ఆధార్ - పాన్ లను లింక్ (Aadhaar-PAN linking) చేయనట్లైతే.. పాన్ నిరుపయోగమవుతుంది. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

Aadhaar-PAN linking deadline: ఆధార్ - పాన్ లను అనుసంధానం చేయడానికి ఆఖరు తేదీ జూన్ 30. ఈ లోపే రూ. 1000 చెల్లించి, ఆధార్ - పాన్ లను లింక్ చేయాల్సి ఉంటుంది. పాన్ ఉన్న భారతీయ పౌరులందరూ తమ ఆధార్ కార్డును, పాన్ తో తప్పని సరిగా లింక్ (Aadhaar-PAN linking) చేయాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు లింక్ చేయని వారు రూ. 1000 చెల్లించి, జూన్ 30 లోగా ఆన్ లైన్లో పాన్ - ఆధార్ ను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఒక వ్యక్తి ఒక పాన్ ను మాత్రమే తీసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ పాన్ లు ఉండడం నేరం. వారికి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు.

What happens if not linked?: లింక్ చేయనట్లైతే..

ఈ జూన్ 30 లోగా ఆధార్ - పాన్ లను లింక్ చేయనట్లైతే..

  • వారి పాన్ (PAN) నిరుపయోగమవుతుంది.
  • పెండింగ్ టాక్స్ రీఫండ్స్, వాటిపై వడ్డీ చెల్లించబడదు.
  • ఎక్కువ మొత్తంలో టీడీఎస్ (TDS) చెల్లించాల్సి వస్తుంది.
  • ఎక్కువ మొత్తంలో టీసీఎస్ (TCS) చెల్లించాల్సి వస్తుంది.

Steps to link PAN-Aadhaar: లింక్ చేయడం ఎలా?

ఆధార్ - పాన్ లను అనుసంధానం చేయడం కోసం మొదటగా..

  • https://www.incometax.gov.in/iec/foportal వెబ్ సైట్ ను ఓపెన్ చేసి లాగిన్ కావాలి.
  • డ్యాష్ బోర్డుపై ప్రొఫైల్ సెక్షన్ లోని ఆధార్ - పాన్ ఆప్షన్ లో ఉన్న Link Aadhar పై క్లిక్ చేయాలి.
  • మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • మీ పాన్ నెంబర్ ను, రిజిస్టర్డ్స్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • e-Pay Tax page లోకి వెళ్లాలి.
  • Income Tax Tile పై క్లిక్ చేయాలి.
  • AY వద్ద 2024-25 ని సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ పేమెంట్ వద్ద Other Receipts (500) ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి.
  • మీరు చెల్లించాల్సిన మొత్తం సంబంధిత గడుల్లో ఫిల్ అయి కనిపిస్తుంది.
  • ఆ మొత్తాన్ని చెల్లించిన అనంతరం, మీ పాన్ - ఆధార్ లింక్ అవుతుంది.

తదుపరి వ్యాసం