తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters Launch: డిసెంబర్లో మార్కెట్లోకి ఐదు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్

Electric scooters launch: డిసెంబర్లో మార్కెట్లోకి ఐదు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్

HT Telugu Desk HT Telugu

02 December 2023, 20:47 IST

    • Electric scooters launch: ఈ డిసెంబర్ నెలలో భారతీయ ఆటో మార్కెట్లోకి ఐదు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ కాబోతున్నాయి. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Electric scooters launch: దేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లపై వినియోగదారుల్లో ఆసక్తి, విశ్వాసం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ నెలలో ఐదు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ రోడ్లపై పరుగులు తీయడం ప్రారంభించనున్నాయి.

Bajaj Chetak Urbane: బజాజ్ చేతక్ అర్బేన్

ఈ నెలలో లాంచ్ అవుతున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ .. ‘బజాజ్ చేతక్ అర్బేన్‌ (Bajaj Chetak Urbane)’. ఈ మోడల్ బేస్ వేరియంట్ లో డ్రమ్ బ్రేక్స్, సింగిల్ ఎకో రైడింగ్ మోడ్‌ ఉన్నాయి. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.21 లక్షల వరకు ఉంటుంది. బజాజ్ చేతక్ ప్రీమియం అప్ డేట్ కూడా త్వరలో రానుంది.

Ather 450 Apex: ఏథర్ 450 అపెక్స్

ఏథర్ 450 అపెక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఈ డిసెంబర్ నెలలో లాంచ్ అవుతోంది. ఇందులో మెరుగైన యాక్సిలరేషన్, పర్ఫార్మెన్స్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

Simple Dot One: సింపుల్ డాట్ వన్

సింపుల్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్ డాట్ వన్ ను ఈ డిసెంబర్ నెలలోనే డెలివరీ చేయనుంది. సింపుల్ డాట్ వన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులో ఉంటాయి.

Kinetic Green electric scooter: కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్

కైనెటిక్ గ్రీన్ డిసెంబర్ 11న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తోంది.ఈ మోడల్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. అయితే, ఈ మోడల్ తో తమ బ్రాండ్ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి చొచ్చుకుపోతుందని ఆశిస్తున్నామని కైనెటిక్ గ్రీన్ ఆశిస్తోంది.

Gogoro Crossover: గొగోరో క్రాసోవర్

తైవానీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ గొగోరో (Gogoro) తన మొదటి ఎలక్ట్రిక్ ఆఫర్‌ను క్రాస్ఓవర్ ఇ-స్కూటర్ రూపంలో భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆఫ్ రోడ్ ఫ్రెండ్లీ స్కూటర్ అని కంపెనీ చెబుతోంది. త్వరలో భారత్ లో ఈ స్కూటర్ తయారీ ప్లాంట్ ను ప్రారంభిస్తామని గొగోరో (Gogoro) వెల్లడించింది.

తదుపరి వ్యాసం