70కి పైగా సేఫ్టీ ఫీచర్లు, లీటరుకు 20 కి.మీ మైలేజ్.. నయా అవతార్‌లో హ్యుందాయ్ అల్కాజర్
09 September 2024, 16:40 IST
2024 Hyundai Alcazar Launched : హ్యుందాయ్ కొత్త 7 సీటర్ ఎస్‌యూవీ అల్కాజర్ 70 సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇది లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో ఉన్న ఫీచర్లు, ధర వివరాలు ఏంటో పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
2024 హ్యుందాయ్ అల్కాజర్
2024 హ్యుందాయ్ అల్కాజర్ దాని పాత మోడల్ కంటే చాలా విధాలుగా భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా దీని బయటి డిజైన్ అప్‌డేట్ చేశారు. ప్రధాన మార్పులు హెచ్-సైజ్ ఎల్ఈడీ డిఆర్ఎల్‌లు, క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్లైట్లు, క్లియర్ గ్రిల్, మందపాటి స్కిడ్ ప్లేట్లతో అప్‌డేట్ చేశారు.
కొత్త అల్కాజార్‌లో 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్లు, కొత్త టెయిల్గేట్ డిజైన్, కొత్త స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి. పరిమాణం పరంగా, కొత్త అల్కాజార్ దాని పాత మోడల్ కంటే కొంచెం పెద్దదిగా మారింది. దీని పొడవు ఇప్పుడు 4,560 మి.మీ. ఇది మునుపటి వేరియంట్ కంటే 60 మిమీ ఎక్కువ. ఈ ఎస్‌యూవీ వెడల్పు, ఎత్తును కూడా వరుసగా 1,800, 1,700 మిల్లీమీటర్లకు పెంచారు. అయితే వీల్ బేస్ మాత్రం 2,760 ఎంఎంగా ఉంది.
వేరియంట్లు, కలర్ ఆప్షన్లు
2024 హ్యుందాయ్ అల్కాజార్ ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. కొరియన్ ఆటో దిగ్గజం ఈ ఎస్‌యూవీని రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో అందిస్తోంది. ఇందులో 6-సీటర్ వేరియంట్ అలాగే 7-సీటర్ ఆప్షన్ కూడా ఉంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ .14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. డీజిల్ వేరియంట్ ధర రూ .15.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ అల్కాజార్‌ను 8 మోన్-టోన్, ఒక డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. కొత్త ఎమరాల్డ్ మ్యాట్, టైటాన్ గ్రే మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇది డ్యూయల్-టోన్ రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫియరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ బ్లాక్ రూఫ్ డ్యూయల్-టోన్ ఎంపికలతో దొరుకుతుంది.
ఇంజన్ ఎంపిక, మైలేజ్
కొత్త హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులోని 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ 158బిహెచ్‌పీ పవర్, 253ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటితో జత అవుతుంది. ఇందులోని 1.5 లీటర్ యు2 సిఆర్ డిఐ డీజల్ ఇంజన్ 114బిహెచ్‌పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేసి ఉంటుంది.
హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీ లీటరుకు 20.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టెస్ట్ ఫలితాల ప్రకారం, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్న వేరియంట్లు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను బట్టి లీటరుకు 17.5 కిలోమీటర్లు, 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్‌తో లీటరుకు 18.1 కిలోమీటర్లు, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ యూనిట్లతో 20.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఇంటీరియర్ అప్‌డేట్
అల్కాజర్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌ను కూడా అప్ డేట్ చేసింది. క్యాబిన్‌కు కొత్త కలర్ థీమ్‌ను పరిచయం చేసింది. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు దాని కొత్త అవతారంలో డ్యూయల్-టోన్ నోబుల్ బ్రౌన్, హెడ్జ్ నేవీ కలర్ స్కీమ్‌ను అందిస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదే పరిమాణంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా కొత్త డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో డ్యాష్ బోర్డు అప్డేట్ చేశారు. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఇతర ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి.
2 ADAS టెక్‌తో సహా 70కి పైగా భద్రతా ఫీచర్లతో హ్యుందాయ్ 2024 అల్కాజర్ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి 19 ఫీచర్లు ఏడీఏఎస్‌లో ఉన్నాయి. ఎయిర్ బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, ఆల్ డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను కొత్త అల్కాజార్ 6 కలిగి ఉంది.
హ్యుందాయ్ అల్కాజర్ భారత కార్ల మార్కెట్లో కియా కారెన్స్, టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.