తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Honda Shine 125: లేటెస్ట్ అప్ డేట్స్ తో 2023 మోడల్ హోండా షైన్ 125

2023 Honda Shine 125: లేటెస్ట్ అప్ డేట్స్ తో 2023 మోడల్ హోండా షైన్ 125

HT Telugu Desk HT Telugu

21 October 2023, 17:27 IST

google News
  • 2023 Honda Shine 125: లేటెస్ట్ అప్డేట్స్ తో 2023 మోడల్ హోండా షైన్ 125 మార్కెట్లోకి వచ్చింది. హోండా షైన్ 125 దాదాపు గత 15 ఏళ్లుగా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న బైక్ గా నిలిచింది.

2023 మోడల్ హోండా షైన్ 125
2023 మోడల్ హోండా షైన్ 125

2023 మోడల్ హోండా షైన్ 125

2023 Honda Shine 125: హోండా షైన్ 125 భారత్ లో అత్యంత విశ్వసనీయ, అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ గా పేరుగాంచింది. గత 15 సంవత్సరాలుగా ఈ బైక్ భారతీయ ప్రయాణికులకు సేవలను అందిస్తోంది. ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేస్తూ, హోండా షైన్ 125 మోడల్ ను అభిమానులకు సంస్థ అందిస్తోంది. తాజాగా, 2023 మోడల్ మార్కెట్లోకి వచ్చింది.

30 లక్షల యూనిట్లు

ఇటీవల గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో హోండా 30 లక్షలకు పైగా షైన్ మోడళ్లను విక్రయించింది. ఈ 30 లక్షల యూనిట్లలో 20 లక్షల వాహనాలు మహారాష్ట్రలోనే అమ్ముడుపోయాయి. హోండా కంపెనీ 100 cc వాహన సెగ్మెంట్‌లోకి ప్రవేశించినప్పుడు, అదే డిజైన్ ను, అదే పేరును కొనసాగించాలని నిర్ణయించింది.

BS6 ఫేజ్ 2 నిబంధనలు

2023 హోండా షైన్ 125 ఇంజన్ ను ఇప్పుడు BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. ఈ ఇంజిన్ 20% ఇథనాల్-మిశ్రమ ఇంధనంతో పని చేయగలదు. ఈ 125 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ 7,500 ఆర్పీఎం వద్ద 10.54 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంది.

బెస్ట్ మైలేజీ, అఫర్డబుల్ ప్రైస్

ఈ బైక్ మంచి మైలేజీకి, సరసమైన ధరకు ప్రసిద్ధి. వినియోగదారుడు చెల్లించిన ప్రతీ రూపాయికి సరైన విలువ లభించేలా ఈ బైక్ ను రూపొందించారు. 2023 హోండా షైన్ 125 లో సైలెంట్ స్టార్టర్, సీల్డ్ చైన్ మరియు ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ పంప్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే, అనలాగ్ స్పీడోమీటర్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, ఫ్యూయల్ గేజ్ తదితర ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరింత ప్రభావవంతమైన బ్రేకింగ్ కోసం బైక్ కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా ఇందులో ఉంది. పొందుతుంది.

ఐదు రంగుల్లో..

హోండా షైన్ 125 బ్లాక్, జెన్నీ గ్రే మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అన్ని రంగులు ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, టెయిల్ సెక్షన్‌పై బాడీ గ్రాఫిక్స్‌తో వస్తాయి. ఈ 2023 మోడల్ షైన్ 125 ధర (ఎక్స్-షోరూమ్) డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ. 79,800 నుంచి ప్రారంభమవుతుంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 83,800 వరకు ఉంటుంది.

తదుపరి వ్యాసం