PAN cards deactivated: 11.5 కోట్ల పాన్ కార్డ్స్ ను డీయాక్టివేట్ చేశారు.. ఆ లిస్ట్ లో మీ కార్డ్ కూడా ఉందా? చెక్ చేసుకోండి
11 November 2023, 14:45 IST
PAN cards deactivated: ఆధార్ కార్డ్ లో అనుసంధానం చేయనందున సుమారు 11.5 కోట్ల పాన్ కార్డ్‌లు చెల్లకుండా పోయాయి. సమాచార హక్కు అభ్యర్థనకు సమాధానంగా సీబీడీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
PAN-Aadhaar linking news: ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో అనుసంధానం చేయడం తప్పని సరి. అలా అనుసంధానం చేసుకోవడానికిి సీబీడీటీ (Central Board of Direct Taxes CBDT) కొంత గడువును ఇచ్చింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. దాంతో, ఆధార్ కార్డ్ తో అనుసంధానం కాని పాన్ కార్డులను డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది.
11.5 కోట్లు
ఆధార్ కార్డు (aadhaar card)తో లింక్ చేయని మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డు (PAN Card)లను ఇప్పటివరకు డీ యాక్టివేట్ చేసినట్లు సీబీడీటీ (CBDT) వెల్లడించింది. భారత్ లో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 57.25 కోట్ల పాన్ కార్డులు గడువు లోపు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడ్డాయి. దాదాపు 13 కోట్ల పాన్ కార్డులను ఆధార్ కార్డుతో లింక చేయలేదు. వాటిలో సుమారు 11.5 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేశారు. మధ్య ప్రదేశ్ కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్ర శేఖర్ అడిగిన ప్రశ్నకు సీబీడీటీ ఈ సమాధానం ఇచ్చింది. పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేసుకునే గడువు ఈ సంవత్సరం జూన్ 30 తో ముగిసింది.
ఇప్పుడెలా?
తమ పాన్ కార్డులు డీయాక్టివేట్ అయిన పౌరులకు మరో అవకాశం ఉంది. వారు రూ. 1000 చెల్లించి, తమ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకుని, తమ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, ముందుగా, మీ పాన్ కార్డు యాక్టివ్ గా ఉందా? లేక డీయాక్టవేట్ అయిందా? అనే విషయం తెలుసుకోవాలి. అందుకు గానూ ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ అధికారిక వెబ్ సైట్ www.incometax.gov.in/iec/foportal/ ను ఓపెన్ చేయండి.
- హోం పేజీలో ఎడమవైపు కనిపించే Link Aadhaar Status ను క్లిక్ చేయండి.
- మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ లను ఎంటర్ చేయండి.
- View Link Aadhaar Status' పై క్లక్ చేయండి.
- మీ పాన్, ఆధార్ నంబర్లు లింక్ అయ్యాయో లేదో డిస్ ప్లే అవుతుంది.