తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananne Maa Bhavishyathu : గ్రౌండ్ లోకి వైసీపీ... 7 లక్షల మంది సైన్యంతో 'పీపుల్స్ సర్వే'

Jagananne Maa Bhavishyathu : గ్రౌండ్ లోకి వైసీపీ... 7 లక్షల మంది సైన్యంతో 'పీపుల్స్ సర్వే'

HT Telugu Desk HT Telugu

05 April 2023, 19:38 IST

google News
    • Jagananne Maa Bhavishyathu Updates:ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట అనే విధంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. 7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయత నమోదు చేసేలా ‘పీపుల్స్‌ సర్వే’ చేపట్టనుంది.
ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'
ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు' (facebook)

ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'

YSRCP Jagananne Maa Bhavishyathu: అధికార వైసీపీ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. 7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు' అంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్తారు. జగనన్న సారథ్యంలోని వై స్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే 'జగనన్నే మా భవిష్యత్తు'. 'మా నమ్మకం నువ్వే జగన్'. క్షేత్రస్థాయిలోని ప్రతి ఇంటికి వెళ్లి చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులను ఏర్పాటు చేయనున్నారు.

ఫోన్ కాల్…

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభిస్తారు. ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల ­పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు. ‘పీపుల్స్‌ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదు చేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహ సారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.

ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైసీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే దిశగా ముందుకెళ్తోంది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

తదుపరి వ్యాసం