తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Cheyutha: నేడు ఏపీలో వైఎస్సార్ చేయూత నిధుల విడుదల.. అనకాపల్లిలో జిల్లాలో సిఎం పర్యటన

YSR Cheyutha: నేడు ఏపీలో వైఎస్సార్ చేయూత నిధుల విడుదల.. అనకాపల్లిలో జిల్లాలో సిఎం పర్యటన

Sarath chandra.B HT Telugu

07 March 2024, 8:12 IST

google News
    • YSR Cheyutha: ఏపీలో నేడు వైఎస్సార్ చేయూత నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అనకాపల్లి Anakapalle జిల్లాలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొంటారు. 
నేడు అనకాపల్లిలో నాలుగో విడత చేయూత నిధుల విడుదల చేయనున్న సిఎం జగన్
నేడు అనకాపల్లిలో నాలుగో విడత చేయూత నిధుల విడుదల చేయనున్న సిఎం జగన్

నేడు అనకాపల్లిలో నాలుగో విడత చేయూత నిధుల విడుదల చేయనున్న సిఎం జగన్

YSR Cheyutha: ఏపీలో నేడు వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వైసీపీ YCP అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాది లబ్దిదారుల ఖాతాల్లోకి నిధుల్ని జమ చేయనున్నారు. అనకాపల్లి పిసినికాడలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7 నుండి 14 రోజుల పాటు "వైఎస్సార్ చేయూత" కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది మహిళలకు రూ. 5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లోDBT Benefits జమ చేయనున్నారు.

45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీ మహిళలకు"వైఎస్సార్ చేయూత" ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు.

నాలుగేళ్లలో లబ్దిదారులైన మహిళలకు ఒక్కొక్కరికి మొత్తం రూ. 75,000 ఆర్థిక సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది మహిళలకు వారి కుటుంబాలతో కలిపి దాదాపు కోటి మంది జనాభాకు మేలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నేడు అందిస్తున్న రూ. 5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఒక్క చేయూత పథకం ద్వారా మొత్తం రూ.19,189.60 కోట్లను మహిళల ఖాతాలకు చెల్లించారు.

వైఎస్సార్ చేయూత ద్వారా పొందే డబ్బును ఉపయోగించుకోవడానికి మహిళలకు పూర్తి స్వేచ్ఛ  Women Empowerment ఇస్తూ దీన్ని చిన్న మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి, మరే ఇతర అవసరాలకు లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు వారికి వెసులుబాటు కల్పించారు.

ఆసక్తి కనబరిచిన మహిళలకు సాంకేతిక సాయం, బ్యాంకింగ్, మార్కెటింగ్ కంపెనీలతో టైఅప్ ద్వారా సహకారాలు అందించి, కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు వంటి అనేక జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ, వ్యాపార అవకాశాలు పెంచేందుకు బ్యాంకులతో టైఅప్ చేయించి చేయూతనిస్తున్నారు.

కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ITC, HUL, P&G, RELIANCE లాంటి దిగ్గజ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు, మార్కెటింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుండి రుణాలు పొందేలా అనుసంధానం చేసి వారు రిస్క్ లేకుండా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

తద్వారా నెలకు రూ.10,000లకు పైగా అదనపు ఆదాయం అందుకుంటున్నారని ఇప్పటి వరకు 1,69,018 మంది మహిళలు కిరాణా దుకాణాలు, 85,630 మంది వస్త్ర. వ్యాపారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు.

మహిళలకు జీవనోపాధి కల్పించడం కోసం చేయూత లబ్ధికి అదనంగా ఇప్పటికే స్త్రీనిధి, బ్యాంకుల నుండి రుణాలు పొందేలా అనుసంధానం చేసి రూ. 6,266.82 కోట్లకు పైగా రుణాలు అందించారు.

వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ఏర్పాటు ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్ లో శిక్షణ ఇచ్చి వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

58 నెలల్లో వివిధ పథకాల (DBT, Non-DBT) ద్వారా మహిళలకు అందించిన లబ్ధి అక్షరాల రూ. 2,77,870 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ సాయంతో ఇప్పటి వరకు 1,69,018 మంది లు కిరాణా దుకాణాలు, 85,630 మంది వస్త్ర వ్యాపారం, 3,80,466 మంది ఆవులు, గేదెలు 1,34,514 గొర్రెలు, మేకల పెంపకం, 1,38,621 మంది కోళ్ల పెంపకం, 88,923 మంది ఆహార ఉత్పత్తులు, 3,98,422 మంది వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, 2,59,997 మంది ఇతర జీవనోపాధులు చేపట్టి మొత్తం 16,55,591 మంది వారి కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్నారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తదుపరి వ్యాసం