తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Letter : సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ

YS Sharmila Letter : సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ

23 October 2024, 22:30 IST

google News
  • YS Sharmila Letter To YS Jagan : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మిడి ఆస్తులపై వివాదం నెలకొంది. ఈ విషయంపై వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు.  వైఎస్ జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ షర్మిల రాసిన లేఖను టీడీపీ ఎక్స్ వేదికగా బయటపెట్టింది.

సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ
సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ

సొంత తల్లిపై కేసు, చెల్లి ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు- వైఎస్ జగన్ కు షర్మిల సంచలన లేఖ

వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తి వివాదం రచ్చకెక్కింది. గత కొంతకాలంగా వీరి మధ్య సాగిన లేఖల యుద్ధం ఇప్పుడు బయట పడింది. వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో వైఎస్ షర్మిల, విజయమ్మపై వేసిన పిటిషన్ వెలుగుచూసింది. సెప్టెంబర్ 12న వైఎస్ జగన్ కు షర్మిల, విజయమ్మ రాసిన లేఖను టీడీపీ ఎక్స్ వేదికగా బయటపెట్టింది. ఈ లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సూచినంచిన విధంగా ఉమ్మడి ఆస్తులు పంచాలని వైఎస్ షర్మిలతో పాటు విజయమ్మ కోరుతున్నారు. ఇందుకు వైఎస్ జగన్ నో చెబుతున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో వైఎస్ జగన్...తన సోదరి షర్మిలకు లేఖ రాశారు. అనినాష్ రెడ్డితో పాటు తన గురించి, తన భార్య భారతి గురించి మాట్లాడకూడదంటూ జగన్ పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది. దీనిపై షర్మిల, విజయమ్మ నుంచి స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 9న జగన్ కోర్టుకెళ్లారు. జగన్ కోర్టుకెక్కడంతో సెప్టెంబర్ 12న జగన్‌కు షర్మిల లేఖ రాశారు. ఇందులో 10 కీలకమైన అంశాలతో ఆమె ప్రస్తావించారు.

వైఎస్ జగన్ సూచించిన షరతులను వైఎస్ షర్మిల అంగీకరించలేదు. తన కెరీర్‌ను, రాజకీయాల్ని నిర్దేశించడానికి మీరెవరని ప్రశ్నించారు. ఉమ్మడి ఆస్తుల్లో తన నలుగురు మనవళ్లకు సమాన వాటాలు దక్కాలన్నదే తన తండ్రి వైఎస్ఆర్ ఆకాంక్ష అన్నారు. తండ్రి ఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ ఆలోచిస్తున్నారన్నారు. సాక్షి మీడియాలో తనకు తీరని ద్రోహం చేశారని, నాన్న కలలో కూడా ఊహించని విధంగా అమ్మపై, తనపై కేసులు పెట్టారని ఆవేదన చెందారు. సరస్వతి పవర్‌లో అమ్మకు ఇచ్చిన షేర్లు మీరు రాసిచ్చినవి కావా? అని జగన్ ప్రశ్నించారు. ఆస్తుల్లో తనకు ఎలాంటి హక్కులు లేకుండా చేయాలనే మీ దుర్బుద్ధి అర్థమైందని ఘాటుగా స్పందించారు. మీరు ఎన్ని చేసినా తన గమ్యాన్ని అడ్డుకోలేరని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పట్లో ఆస్తులపై పరస్పర ఒప్పందం

"మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురికీ(మనవళ్లు, మనవరాళ్లకి) సమానంగా పంచాలని ఆదేశించారు. మీరు కూడా ఆ షరతుకి అంగీకరిస్తున్నానని అప్పుడు మాకు హామీ ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటున్నారు. భారతి సిమెంట్స్‌, సాక్షి, సహా రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురికీ సమానంగా పంచాలని ఆనాడే ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు, మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమించారు." అని షర్మిల జగన్ లేఖ రాశారు.

"నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు, అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయుంచుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైనది. మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లందరికీ మానవరాళ్లకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారు.

మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌వోయూ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత. ఎంవోయూ చేసుకున్న దాని ప్రకారం కాకుండా, మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం. 20 ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా, ఎంవోయూలో పేర్కొన్న అన్ని ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ దానికి నేను కట్టుబడి ఉన్నాను."- వైఎస్ షర్మిల

తదుపరి వ్యాసం