Eluru district : గోదావరి చూపిస్తానని తీసుకెళ్లి... చిన్నారిపై యువకుడు అత్యాచారం!
27 July 2024, 11:02 IST
- Eluru district Crime News : ఏలూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. గోదావరి చూపిస్తానని తీసుకెళ్లి ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం చేశాడు.
ఏలూరు జిల్లాలో చిన్నారిపై రేప్...!
ఏలూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వర్షాలతో పొంగిపొర్లుతున్న గోదావరి నది వరదను చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లి ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కామాంధుడు ఆ చిన్నారికి సమీప బంధువు అవుతాడు. ఇంటి ముందే ఆడుకుంటున్నా ఆ చిన్నారిని ఎలాగోలా తీసుకెళ్లాలని ఆలోచించిన ఆ యువకుడు, గోదావరి చూపిస్తానని నెపంతో ట్రాక్టర్ ఎక్కించి తీసుకెళ్లాడు.
ఈ ఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని ఒక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుక్కునూరు మండలంలోని రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ తరువాత తోటి చిన్నారులతో కలిసి ఆ బాలిక ఆడుకుంటున్న సమయంలో సమీప బంధువు మడకం వెంకటేష్ (24) ట్రాక్టర్ నడుపుకుంటూ అటుగా వచ్చాడు. తోటి చిన్నారులతో ఆడుకుంటున్న బాలికను చూసిన వెంకటేష్, గోదావరి చూపిస్తానని చిన్నారిని రమ్మన్నాడు.
అభంశుభం తెలియని ఆ చిన్నారి ఆ కామాంధుడి మాటలు విని ఆయన దగ్గరకు వెళ్లింది. దీంతో ట్రాక్టర్ ఎక్కించి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఒక హోటల్ వద్ద చిన్నారికి తినడానికి కొన్ని తినిబండాలరాలను కొనిపెట్టాడు. అక్కడ నుంచి గోదావరి నది వద్దకు ఆ బాలికను తీసుకెళ్లి వరద ప్రవాహం చూపించాడు. అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరారు. అయితే మార్గమధ్యలో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) భవనం వద్ద ట్రాక్టర్ ఆపి, ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం మళ్లీ చిన్నారిని ట్రాక్టర్ ఎక్కించి ఏమీ తెలియనట్లు ఆ చిన్నారిని ఊరు శివార్లలో దింపేశాడు. అప్పటికే రాత్రి అయిన కుమార్తె ఎక్కడి వెళ్లిందని తల్లిదండ్రులు వెతుకుతున్నారు. అటుగా ఏడూస్తు ఆ చిన్నారి ఇంటివైపు రావడం చూసి తల్లిదండ్రులు చిన్నారి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడిగారు. అయితే బాలిక నొప్పి భరించలేక ఏడుస్తోంది.
దీన్ని గమనించిన తల్లిదండ్రులు అమరవరం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి జంగారెడ్డి గూడెం ఏరియా హాస్పటిల్‌కి తరలించారు. ఈ సందర్భంలో చిన్నారి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అనంతరం చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆ చిన్నారిని పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శుక్రవారం పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు. కుక్కునూరు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు వెంకటేష్‌ను అరెస్టు చేశారు.
సమీపంలోని గిరిజన ప్రాథమిక సహకార మార్కెట్ సొసైటీ సమీపంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్న సమయంలోనే ఆ ప్రబుద్దుడు బాలికను ట్రాక్టర్‌పై తీసుకొచ్చి ఊరు శివార్లలో వదిలేసి వెళ్లిపోయాడు. ఏడుస్తూ ఇంటికి వస్తున్న సమయంలో తల్లిదండ్రులు గుర్తించి బాలికను విషయం అడగగా జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది.