తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ysrcp Mlcs Disqualification: వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, రామచంద్రయ్యలపై అనర్హత వేటు

AP Ysrcp MLCs Disqualification: వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, రామచంద్రయ్యలపై అనర్హత వేటు

Sarath chandra.B HT Telugu

12 March 2024, 12:25 IST

google News
    • AP Ysrcp MLCs Disqualification: పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, రామచంద్రయ్యలపై  అనర్హత వేటు వేస్తున్నట్లు ఏపీ శాసన మండలి ప్రకటించింది.
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

AP Ysrcp MLCs Disqualification: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఉంటూ టీడీపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మండలి ఛైర్మన్ వేటు వేశారు.

విశాఖలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీకృష్ణయాదవ్‌తో పాటు టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యపై వేటు పడింది. వీరిద్దరిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై మండలి ఛైర్మన్ కార్యాలయం పలు మార్లు విచారణ జరిపింది. విచారణలో పార్టీ మారిన సభ్యుల నుంచి వివరణ తీసుకున్న తర్వాత వారిపై వేటు వేసినట్టు మండలి వర్గాలు తెలిపాాయి.

వంశీకృష్ణ యాదవ్ vamsi krsihan Yadavజనసేన నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుండగా, రామచంద్రయ్య టీడీపీలో చేరారు. అనర్హత ఫిర్యాదులపై ఎమ్మెల్సీలు ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందకపోవడంతో వారిపై అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. సమగ్ర విచారణ తర్వాత వేటు వేసిన శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై ఇప్పటికే 8మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైసీపీకి చెందిన నలుగురు, టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. తాజా మరో ఇద్దరు మండలి సభ్యులపై ఛైర్మన్ వేటు వేశారు.

మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అనర్హత వేటు ప్రభావం ఎన్నికలపై ఉండకపోవచ్చు. వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే జనసేన నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. పార్టీలు ఫిరాయించిన వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవికి టిక్కెట్ దక్కలేదు.

తదుపరి వ్యాసం