తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Murder: మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Kadapa Murder: మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

30 September 2024, 9:50 IST

google News
    • Kadapa Murder: కడప జిల్లాలో బాంబు దాడిలో విఆర్‌ఏ ప్రాణాలు కోల్పోయాడు. హత్య పక్కా ప్రణాళికతో మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నిద్రిస్తుండగా మంచం కింద డిటోనేటర్ తో పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఘటన వెనక పాత కక్షలు, వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పేల్చి విఆర్‌ఏ హత్య
మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పేల్చి విఆర్‌ఏ హత్య

మంచం కింద జిలెటిన్ స్టిక్స్‌ పేల్చి విఆర్‌ఏ హత్య

Kadapa Murder: కడప జిల్లా వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామంలో బాంబు దాడితో విఆర్‌ఏను హతమార్చడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న విఆర్‌ఏ మంచం కింద జిలెటిన్‌ స్టిక్కుల్ని పేల్చి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నిందితుడు పక్కింట్లో నుంచి విఆర్‌ఏ ఇంట్లోకి జిలెటిన్‌ స్టిక్స్‌ ఏర్పాటు చేసి డిటోనేటర్‌ సాయంతో పేల్చేశాడు.

వేముల కొత్త పల్లి గ్రామంలో నివసిస్తున్న విఆర్‌ఏ నరసింహులు ఇంటిని ప్రత్యర్థులు బాంబులతో పేల్చేశారు. మంచం కిందజిలెటిన్ స్టిక్స్‌ పేల్చడంతో విఆర్‌ఏ నరసింహులు స్పాట్‌లోనే ప్రాాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నరసింహులు భార్యకు గాయాలయ్యాయి. మృతుడికి బాబు అనే వ్యక్తితో విభేదాలు ఉన్నాయి. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి విఆర్‌ఏపై తల్వార్లతో దాడికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గ్రామంలో కూడా పలుమార్లు ఇరువురి మధ్య పంచాయితీ జరిగింది. ఈ క్రమంలో నరసింహులును హతమార్చేందుకు పొరుగింట్లో మకాం వేసిన నిందితుడు అతని ఇంట్లోకి జిలెటిన్‌ స్టిక్కులను, ఫ్యూజ్‌వైర్లను అమర్చాడు. ఆదివారం రాత్రి మృతుడు ఓ మంచంపై, భార్య మరోమంచంపై నిద్రిస్తుండగా డిటోనేటర్లను పేల్చేశాడు. ఈ ఘటనలో మంచం తునతునాకలైంది. వీఆర్‌ఏ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

పులివెందుల పరిసర ప్రాంతాల్లో బైరెటిస్‌గనుల్లో బ్లాస్టింగ్‌ కోసం వినియోగించే జిలెటిన్ స్టిక్స్‌ను హత్యకు వినియోగించినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం