తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp On Volunteers: వాలంటీర్ల జీతాలు పెంచుతాం, బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న అచ్చెన్నాయుడు

TDP On Volunteers: వాలంటీర్ల జీతాలు పెంచుతాం, బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న అచ్చెన్నాయుడు

Sarath chandra.B HT Telugu

26 March 2024, 13:37 IST

google News
  • TDP On Volunteers: ఏపీలో వాలంటీర్లపై టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడంతో టీడీపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. 

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు

TDP On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల volunteers పై బొజ్జల సుధీర్ రెడ్డి  Bojjala sudheer వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  Achhennaiduవివరణ ఇచ్చారు. బొజ్జల చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

టీడీపీ  TDP కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు.శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల  Bojjalaసుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమేనన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను Volunteers  కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని, తెలుగుదేశం పార్టీ వైఖరి ఇదేనన్నారు. .

ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైసీపీతో కలిసి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైకాపా చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. అలాంటి వారు వారి భవిష్యత్ ను వారే పాడు చేసుకుంటున్నారన్నారు.

జగన్ అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదని, అలాంటిది వాలంటీర్లపై కేసులు పడితే పట్టించుకుంటారా? ఒక్క సారి కేసు పడితే వారి భవిష్యత్ అంధకారమేనని వాలంటీర్లు గ్రహించాలన్నారు. వాలంటీర్లు ఎవరు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నేతల ఆగ్రహం….

వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పై మాజీ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదని, చంద్రబాబు మాటమీద నిలబడడని, వాలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అని గతంలో హేళన చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు వాలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారని, టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారని, ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు.

వాలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.

ఒక్కరూపాయి అవినీతి చెయ్యకుండా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని, 2 లక్షల 50 వేల మంది వాలంటీర్లు అంటే మన చుట్టుపక్కల వారేనన్నారు. కేరళ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారని గుర్తు చేశారు. వాలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం