తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Naval Dockyard Jobs : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

Naval Dockyard Jobs : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

22 November 2023, 13:54 IST

    • Visakhapatnam Naval Dockyard Jobs : విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 1వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.
నేవీలో ఉద్యోగాలు
నేవీలో ఉద్యోగాలు

నేవీలో ఉద్యోగాలు

Visakhapatnam Naval Dockyard Jobs : ఇండియన్ నేవీ విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిట్టర్, మెకానిక్ (డీజిల్), ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో మొత్తం 275 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 01, 2024గా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 28, 2024న రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 70:30 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెరిట్ జాబితా రూపొందించి ఫలితాలు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

వయో పరిమితి

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రకారం అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (MSDE) కోసం గరిష్ట వయోపరిమితి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు కనిష్ట వయో పరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల కోసం, కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.

విద్యార్హత

అభ్యర్థులు కనీసం 55% మొత్తంతో SSC/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 65 % మార్కులతో ITI (NCVT/SCVT) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

  • apprenticeshipindia.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.
  • పూర్తి చేసిన దరఖాస్తును విశాఖ నేవల్ డాక్ యార్డ్ అడ్రస్ పంపించాలి.

దరఖాస్తులు పంపించాల్సిన అడ్రస్‌

The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O, P.O, Visakhapatnam-530 014, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ - జనవరి 01, 2024
  • అన్ని ట్రేడ్‌లకు రాత పరీక్ష - ఫిబ్రవరి 28, 2024
  • రాత పరీక్ష ఫలితాలు విడుదల -మార్చి 02, 2024
  • ఇంటర్వ్యూ తేదీ - మార్చి 05-08, 2024
  • ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల- మార్చి 14, 2024
  • వైద్య పరీక్షల తేదీ - మార్చి 1, 2024
  • ట్రైనింగ్‌ ప్రారంభం - మే 2, 2024 నుంచి

అప్రెంటిస్‌లకు ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్‌ ఇస్తారు. నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

తదుపరి వ్యాసం