తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gudivada Amarnath On Pawan : వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే దమ్ముందా?- పవన్ కు మంత్రి అమర్నాథ్ సవాల్

Gudivada Amarnath On Pawan : వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే దమ్ముందా?- పవన్ కు మంత్రి అమర్నాథ్ సవాల్

10 July 2023, 14:11 IST

google News
    • Gudivada Amarnath On Pawan : వాలంటీర్ వ్యవస్థపై పవన్, చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. పవన్ గంజాయి స్టార్, పొలిటికల్ సైడ్ హీరో అంటూ సెటైర్లు వేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్
మంత్రి గుడివాడ అమర్నాథ్

మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడితే అలాగే ఉందని ఎద్దేవా చేశారు. పవన్ పొలిటికల్ సైడ్ హీరో అని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ హైదరబాద్ లో ఎంజాయ్ స్టార్, ఏపీలో గంజాయి స్టార్ అని ఆరోపించారు. పవన్ నిరాశ, ఆవేదనతో ఉన్మాదిలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై స్పందిస్తూ.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారని, పవన్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. పవన్ చూసి ఆడపిల్లలు భయపడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.

వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్ముతున్నారు

సినీ పరిశ్రమలో చాలామంది కమెడియన్లు, కారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినా పవన్ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ తన రాజకీయాల కోసం తల్లి, భార్య పేరును ఉపయోగిస్తున్నారన్నారు. పవన్ గంజాయి తాగుతూ నోటికి వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ విషం చిమ్ముతున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం పవన్, చంద్రబాబుకు ఉందా? అంటూ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. టీడీపీలో జనసేనను విలీనం చేస్తే ప్యాకేజీ రాదని, వేర్వేరు బ్యానర్లు పెట్టుకుని పవన్ దందా చేస్తున్నారని ఆరోపించారు. 2024 అనంతరం డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు కూసిన విధంగా పవన్ పరిస్థితి తయారవుతుందన్నారు.

ఎమ్మెల్యే కాలేనన్న భయం పవన్ లో

పవన్ కల్యాణ్ తన కోసం కాకుండా చంద్రబాబు కోసం మాత్రమే పనిచేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. సీఎం జగన్‌తో పోల్చుకునే అర్హత పవన్ కు లేదన్నారు. జగన్ 2011లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, పవన్ కల్యాణ్ 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏం చేశారని ప్రశ్నించారు. తిరుగుబోతు సంసారం, కాపురాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో పవన్ రాజకీయాల గురించి మాట్లాడితే అలా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుగుదల లేక, ఎమ్మెల్యేను కాలేనని భయం, ఎవరూ ఓట్లు వేయరు, రాజకీయాలకు పనికిరాననే ఆందోళనతో పవన్ మాట్లాడుతున్నారని అమర్ విమర్శించారు. పవన్ తల్లి, భార్యను వైసీపీ ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఓడించారని ప్రజలపై కోపం, తన ఫ్యాన్స్ ఓట్లు జగన్‌కు వేస్తున్నారన్న బాధ పవన్‌లో కనిపిస్తోందన్నారు.

తదుపరి వ్యాసం