తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jobs In Visakhapatnam: విశాఖలో ఉద్యోగాలు, నర్సులు, ఫార్మాసిస్టులకు నోటిఫికేషన్‌

Jobs In Visakhapatnam: విశాఖలో ఉద్యోగాలు, నర్సులు, ఫార్మాసిస్టులకు నోటిఫికేషన్‌

HT Telugu Desk HT Telugu

04 July 2023, 8:17 IST

google News
    • Jobs In Visakhapatnam:విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది నియామకాల కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నిషియన్  ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
విశాఖలో నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు
విశాఖలో నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు

విశాఖలో నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు

Jobs In Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేయడానికి డిఎంహెచ్‌ఓ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.డిస్ట్రిక్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే నియామకాల్లో స్టాఫ్ నర్సులు, గ్రేడ్ 2 ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది నియామకాల కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ నియామకాల్లో భాగంగా 68 స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు.

జనరల్ నర్సింగ్‌ కోర్సుతో పాటు బిఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని స్టాఫ్‌ నర్సులుగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి. ఎంపికైన వారికి కాంట్రాక్టు సమయంలో నెలకు రూ.34వేల రుపాయల పారతోషికం చెల్లిస్తారు.

ఇంటర్మీడియట్ తర్వాత డి ఫార్మసీ, బిఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు గ్రేడ్ 2 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రూ.28వేల వేతనం చెల్లిస్తారు.

ఇంటర్మీడియట్ తర్వాత ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తి చేసిన వారు ల్యాబ్‌ టెక్నిషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఇంటర్‌ తర్వాత ఏడాది ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు, పది తర్వాత రెండేళ్ల డిఎంఎల్‌టి కోర్సు చదివి ఉండాలి. బిఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీని సబ్జెక్టుగా చదివిన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తించిన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. వీరికి రూ.28వేల వేతనం చెల్లిస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు జులై 22వ తేదీలోపు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నిర్ణీత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తునలు విశాఖపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి పంపాల్సి ఉంటుంది.

వైద్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల htyదరఖాస్తు నమూనా దిగువ లింకులో ఉంటుంది.

తదుపరి వ్యాసం