VCBL Recruitment : విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో పీవో ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం
10 January 2024, 15:55 IST
- Visakhapatnam Co operative Bank Recruitment: విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
Visakhapatnam Co operative Bank Recruitment Updates: పీవో(ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా.... ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు జనవరి 28వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఫిబ్రవరిలో రాత పరీక్ష ఉండనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.....
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్.
ఉద్యోగాలు - ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్).
మొత్తం ఖాళీలు - 30 ఉద్యోగాలు.
అర్హతలు - 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
వయోపరిమితి - 20 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు - ఆన్ లైన్ విధానంలో(జనవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి)
దరఖాస్తు రుసుం - రూ.1,000.
దరఖాస్తులకు తుది గడువు - 28 - జనవరి -2024, సాయంత్రం 4 లోపు సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ - ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష 250 మార్కులకు నిర్వహిస్తారు.
ఇంటర్వూకు 50 మార్కులు ఉంటాయి.
ఎగ్జామ్ సెంటర్లు - వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.
పరీక్ష తేదీ - ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.vcbl.in
పీవో పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ తో పాటు పరీక్షా విధానం, సిలబస్, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వివరాలను కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడవచ్చు….