తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri : బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే?

Indrakeeladri : బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే?

HT Telugu Desk HT Telugu

31 July 2022, 21:56 IST

    • బెజవాడ ఇంద్రకీలాద్రి.. దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
ఇంద్రకీలాద్రి(ఫైల్ ఫొటో)
ఇంద్రకీలాద్రి(ఫైల్ ఫొటో) (twitter)

ఇంద్రకీలాద్రి(ఫైల్ ఫొటో)

బెజ‌వాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాల‌ను నిర్వహించేందుకు ఆల‌య వైదిక క‌మిటీ నిర్ణయించింది. అమ్మవారి అలంకారాల‌కు సంబంధించి అధికారులు మాట్లాడారు. దసరా ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాల‌ని జిల్లా క‌లెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

AP High Tension : రణరంగంలా మారిన ఏపీ, తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

'అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా.. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ప్రతి రోజు 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తారు. మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. పూర్వ అనుభావాలను దృష్టిలో పెట్టుకుని.. దసరా ఉత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి.' అని సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు.

భక్తులకు ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు జారీ చేయడం, క్యూ లైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఉచిత అన్నదానం, ప్రసాదంతోపాటు అవసరమైన ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇంద్రకీలాద్రిపై.. భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై.. ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.

దసరా ఉత్సవాలక కోసం వచ్చే భక్తుల కోసం.. కొండపైన దిగువున సూచక బోర్డులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేయాలని కలెక్టర్ అన్నారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య ,ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ సమాచార పౌర సంబంధాలు అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమన్వయ కమిటీ సమావేశం త్వరలో ఉంటుందని.. కలెక్టర్ అన్నారు.

తదుపరి వ్యాసం