తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

ఏపీలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

HT Telugu Desk HT Telugu

17 February 2022, 20:14 IST

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేరుగా ఏపీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గౌరవార్థం ఆయనకు సీఎం విందు ఇచ్చారు.
YS Jagan- Nitin Gadkari meet
YS Jagan- Nitin Gadkari meet (HT Photo)

YS Jagan- Nitin Gadkari meet

Vijayawada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేరుగా ఏపీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గౌరవార్థం ఆయనకు సీఎం విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్‌ గడ్కరీతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

నితిన్ గడ్కరీ- జగన్ మధ్య చర్చ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు

  • రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే విశాఖపట్నం – భీమిలి – భోగాపురం (బీచ్‌ కారిడార్‌) రోడ్డుపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని, టూరిజం రంగం బాగుపడ్డమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్.. గడ్కరీకి వివరించారు. విశాఖ నగరం నుంచి త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలన్నా ఈ రహదారి అత్యంత కీలకమని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుపై సానుకూలత వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి ఏదైనా ప్రఖ్యాత అంతర్జాతీయ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు.
  • విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలను తగ్గించడానికి ఇప్పుడు నిర్మాణం అవుతున్న పశ్చిమ బైపాస్‌ రహదారితో పాటు తూర్పున మరో బైపాస్‌ నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టును మంజూరుచేస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో కృష్ణానదిపై బ్రిడ్జితో పాటు 40 కి.మీ మేర బైపాస్‌ నిర్మాణం అయ్యే అవకాశం ఉంది.
  • అలాగే రాష్ట్ర రహదారులపై 33 ఆర్వోబీల నిర్మాణంపై కూడా సీఎం కేంద్రమంత్రితో చర్చించారు. వీటన్నింటికీ ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్‌ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.