తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Justice For Viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. సోషల్ మీడియాలో టీడీపీ ట్రోలింగ్

Justice for viveka: వివేకా హత్యకు నాలుగేళ్లు.. సోషల్ మీడియాలో టీడీపీ ట్రోలింగ్

HT Telugu Desk HT Telugu

15 March 2023, 12:26 IST

    • Justice for viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్ల పూర్తవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. #JusticeForYSViveka హ్యాష్‌ ట్యాగ్‌తో  టీడీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. గురైన వివేకా కేసులో నిజం తెలియాలని ట్వీట్స్ చేస్తున్నారు.
జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు ట్వీట్
జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు ట్వీట్

జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు ట్వీట్

Justice for viveka: వివేక హత్యకు నాలుగేళ్లు అయిన సందర్భంగా జస్టిస్ ఫర్ వివేక పేరుతో టీడీపీ నేతలు ట్రోలింగ్ ప్రారంభించారు. ఇదే హ్యాష్ ట్యాగ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని పులివెందుల పూల అంగాళ్ల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు...చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా....! అని చంద్రబాబు ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.

వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటా తెలుసు...అది ఆ ఇంట జరిగిన కుట్రేనని చంద్రబాబు ఆరోపించారు.

తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి... బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి....ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? అంటూ వివేకా హత్య పరిణామాల పై టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

మరోవైపు ట్విట్టర్‍లో #JusticeForYSViveka ‍హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా #JusticeForYSViveka పేరుతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగేళ్లు అవుతుండటంతో #JusticeForYSViveka హ్యాష్‌ ట్యాగ్‍తో వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా వివేక వర్దంతిపై ట్వీట్ చేశారు. వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా చంపేశారని, హంతకులే నాలుగేళ్లుగా నాలుగు కట్టుకథలు వినిపించారని లోకేష్ ఆరోపించారు. బాబాయ్ హత్యకేసులో అబ్బాయిలను అరెస్టు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీబీఐని జగన్ ఎందుకు తన అధికారంతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు వైఎస్ వివేకా హత్యపై టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆసక్తికర ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే కథ మొత్తం చెప్పగలిగేవాడు డైరెక్టర్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. నాలుగేళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు జగన్ చెప్పినంతగా చెప్పలేకపోయిందన్నారు. హత్య జరిగిన నాడే అంత వివరంగా జగన్ ఎలా చెప్పారని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్ ప్రసంగం వీడియోను తన ట్వీట్‍కు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి జత చేశారు.

టాపిక్