తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : ఆగస్టు 7న టీటీడీ కల్యాణమస్తు.. దరఖాస్తు చేసుకోవాలి ఇలా..

TTD : ఆగస్టు 7న టీటీడీ కల్యాణమస్తు.. దరఖాస్తు చేసుకోవాలి ఇలా..

HT Telugu Desk HT Telugu

27 July 2022, 22:24 IST

google News
    • పిల్లలకు వివాహాలు చేయడం భారంగా ఉన్న కుటుంబాలకు టీటీడీ మంచివార్త చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు జరిపించనుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి చేయడమంటే.. ఎంతో ఖర్చు. పేదలు, మధ్యతరగతి వాళ్లు అప్పులు చేసి మరి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత అప్పు తీర్చేందుకే జీవితం అయిపోతుంది. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణ తేదీకంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే టీటీడీ కల్యాణమస్తులో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కొన్ని నిబంధనలు పాటించాలి. వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుకు అటాచ్ చేయాలి. విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, విద్యార్హతలు, వృత్తి, వారివారి పూర్తి చిరునామాను రాయాలి. వధూవరులు వారి మొబైల్‌ ఫోన్‌ నంబర్లను నమోదు చేయాలి.

స్వీయ అంగీకార పత్రంలో తాము హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని తెలియచేయాలి. జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు చూపించాలి. పెళ్లి చేసుకునే సమయానికి మేజర్లమని తెలపాలి. మానసిక సమస్యలు ఏం లేవని తెలియజేయాలి. వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం పాఠశాల సర్టిఫికెట్‌ లేదా ఆధార్‌కార్డు జత చేయాలి. తల్లిదండ్రుల ఆధార్‌ జిరాక్స్ కూడా జత చేయాలి. వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్‌ ధ్రువీకరణ ఉండాలి.

తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నట్టుగా అంతకుముందు వివాహం కానట్టుగా సెక్షన్‌–8 హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం రిజిష్టర్‌ చేయించుకునే బాధ్యత తమదేనని చెప్పాలి. వివాహం చేసుకోవడంలో బాధ్యత తమదేనని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్నట్లు వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు సంతకం చేయాలి.

టాపిక్

తదుపరి వ్యాసం